ఫ్రీ అమెజాన్‌ సబ్‌స్క్రిప్షన్‌తో గెలాక్సీ ఫోన్‌
close

Published : 12/10/2020 22:58 IST

ఫ్రీ అమెజాన్‌ సబ్‌స్క్రిప్షన్‌తో గెలాక్సీ ఫోన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: వరుస లాంచ్‌లతో దూకుడు మీదున్న శాంసంగ్ త్వరలో మిండ్ రేంజ్‌లో మరో కొత్త ఫోన్‌ను విడుదల చేయనుంది. శాంసంగ్‌ గెలాక్సీ ఎం31 ప్రైమ్‌ ఎడిషన్‌ పేరుతో దీన్ని తీసుకొస్తోంది. గతంలో వచ్చిన గెలాక్సీ ఎం31 మోడల్‌కు కొనసాగింపుగా దీనిని విడుదల చేస్తున్నారు. ఈ ఫోన్‌తో పాటు 3 నెలల అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా ఇస్తున్నారు. వాటర్‌డ్రాప్‌ నాచ్‌ డిస్‌ప్లే, క్వాడ్ రియర్‌ కెమెరా ఫీచర్స్‌ ఉన్నాయి. ఆండ్రాయిడ్‌ 10 ఆధారిత ఓఎస్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఆక్టాకోర్ ఎగ్జినోస్‌ 9611 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 6.4 అంగుళాల ఇన్ఫినిటీ-యు సూపర్ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు.

ఈ ఫోన్‌లో మొత్తం ఐదు కెమెరాలు ఉన్నాయి. వెనక వైపు 64 ఎంపీ ప్రైమరీ సెన్సర్‌ కెమెరాతో పాటు 8 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, రెండు 5 ఎంపీ కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరా అమర్చారు. 6,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ ఫాస్ట్ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఈ ఫోన్‌ 6జీబీ/64జీబీ, 6జీబీ/ 128జీబీ వేరియంట్లలో లభించనుంది. దీని ప్రారంభ ధర రూ. 16,499. ఓషన్‌ బ్లూ, స్పేస్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. విడుదల తేదీని మాత్రం ప్రకటించలేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న