7K ఎంఏహెచ్‌ బ్యాటరీ ఫోన్‌ ధర ఎంతంటే?
close

Published : 01/09/2020 13:56 IST
7K ఎంఏహెచ్‌ బ్యాటరీ ఫోన్‌ ధర ఎంతంటే?

ఇంటర్నెట్‌డెస్క్: స్మార్ట్‌ఫోన్‌ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శాంసంగ్‌ గెలాక్సీ ఎం51 ఫోన్‌ను ఎట్టకేలకు విడుదలయింది. క్వాడ్ రియర్‌ కెమెరా, హోల్ పంచ్‌ డిస్‌ప్లే, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్స్‌తో ఈ ఫోన్‌ను జర్మనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. ఎం51లో 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ సూపర్‌ అమోలెడ్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లేను ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత వన్‌యూఐ ఓఎస్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. ఫోన్‌ విడుదలకు ముందు క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 730 ప్రాసెసర్‌ ఉపయోగించినట్లు వార్తలు వెలువడ్డాయి. కానీ ఈ ఫోన్‌లో ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ను ఉపయోగించినట్లు శాంసంగ్ చెబుతోంది. అలానే ఇందులో వాడిన చిప్‌సెట్ పేరును కూడా కంపెనీ ఇంతవరకు వెల్లడించలేదు.

ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో మొత్తం ఐదు కెమెరాలు ఉన్నాయి. వెనుక నాలుగు, ముందువైపు ఒకటి ఇస్తున్నారు. వెనుక వైపు 64 మెగాపిక్సెల్‌ ప్రైమరీ సెన్సార్‌ కెమెరా, 12ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాతో పాటు 123 డిగ్రీల ఫీల్డ్ వ్యూ 5 మెగాపిక్సెల్ కెమెరా, 5 ఎంపీ మాక్రో కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్  కెమెరాను అమర్చారు. 7,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 

ప్రస్తుతం ఈ ఫోన్‌కు సంబంధించి జర్మనీలో ముందస్తు ఆర్డర్లు తీసుకుంటున్నారు. సెప్టెంబరు రెండో వారంలో భారత్ మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉందని టెక్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 6 జీబీ ర్యామ్‌, 128జీబీ అంతర్గత మెమొరీ వేరియంట్  ధర 360 యూరోలు. అంటే మన కరెన్సీ ప్రకారం సుమారు రూ.31,000. మరి ఇక్కడ ఎంత ధరలో తీసుకొస్తారో చూడాలి. బ్లాక్‌, వైట్ రంగుల్లో ఈ ఫోన్‌ లభించనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న