ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వీడియో గేమ్‌
close

Published : 07/12/2020 23:31 IST
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వీడియో గేమ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: వీడియో గేమ్స్‌.. ఉన్నచోటు నుంచి కదలకుండా కంప్యూటర్‌ లేదా మొబైల్‌ ఫోన్లో ఆడుకునే ఆటలు. నేటి తరంలో వీటికి విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే ఆన్‌లైన్‌లో లెక్కలేనన్ని అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో కొన్ని ఉచితంగా ఆడేవైతే.. మరికొన్నింటికి సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కాకుండా టీవీకి కనెక్ట్‌ చేసి ప్రత్యేకంగా ఆడుకునేలా ఖరీదైన వీడియో గేమ్‌లూ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే వాటి ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. కానీ అమెరికాలోని డల్లాస్‌లో నిర్వహించిన వేలంలో ఓ వీడియో గేమ్‌ అత్యధిక ధర పలికి రికార్డులు సృష్టించింది. నింటెండో కంపెనీకి చెందిన సూపర్ మారియో బ్రోస్‌ 3 అనే వీడియో గేమ్‌ వేలంలో 1,56,000 డాలర్లు ధర పలికింది. అంటే మన కరెన్సీలో సుమారు రూ. 1.15 కోట్లు. గతేడాది వేలంలో కూడా సూపర్‌ మారియో బ్రోస్‌ వీడియో గేమ్‌ వేలంలో 1,14,000 డాలర్ల ధర పలికిందని వేలం నిర్వహించిన హెరిటేజ్‌ ఆక్షన్స్ తెలిపింది.

ఈ వీడియో గేమ్ అంత ధర పలకడానికి గల కారణాలు కూడా కొంచెం వింతగా అనిపిస్తాయి. వీడియో గేమ్ ప్యాక్‌ చేసిన బాక్స్‌ డిజైన్, పేరులో బ్రోస్‌ అనే పదం బాక్స్‌ పైభాగంలో ఎడమ వైపు ముద్రించడం, బొమ్మలో మారియో క్యారెక్టర్‌ చేతికి వైట్‌ గ్లౌవ్స్‌ ఉండటం, అలానే పాత వీడియో గేమ్‌లను ప్యాక్‌ చేసిన బాక్స్‌ నాణ్యత, ఆ బాక్స్‌కి వేసిన సీల్‌ ఆధారంగా రేటింగ్ ఇచ్చే వాటా కంపెనీ దీనికి 9.2 ఏ+ రేటింగ్ ఇవ్వడం వల్ల ఈ వీడియో గేమ్ వేలంలో అంత ధర పలికినట్లు నిర్వాహకులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న