వీడియో ఎడిటింగా... ఈ యాప్‌లు ఉన్నాయిగా
close

Published : 22/11/2020 12:36 IST

వీడియో ఎడిటింగా... ఈ యాప్‌లు ఉన్నాయిగా

ఆండ్రాయిడ్‌ స్మార్ట్ ‌ఫోన్లకు సంబంధించి...

స్మార్ట్‌ఫోన్లు వచ్చాక ఫొటోలు, వీడియోలు తీసుకోవడం సులభమైపోయింది. వీడియోకు ఆసక్తికరమైన ఎఫెక్ట్స్‌ జోడించి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేసేస్తున్నారు. లైక్‌లు, కామెంట్లు సంపాదించేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్లలో వీడియో ఎడిటింగ్‌ ఉన్నప్పటికీ కొన్ని పరిమితులు ఉంటాయి. అందుకే ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ స్మార్ట్‌ఫోన్లలో వీడియో ఎడిటింగ్‌ చేసేందుకు వివిధ యాప్స్‌ అందుబాటులోకి వచ్చేశాయి. వాటితో చాలా సులభంగా మీరూ వీడియోలు రూపొందించొచ్చు, ఎడిట్‌ చేయొచ్చు. 


వారం ఫ్రీ.. తర్వాత డబ్బులు

ఆండ్రాయిడ్‌ ఫోన్లలో వీడియో ఎడిటింగ్‌కు ‘పవర్‌ డైరెక్టర్‌’ యాప్‌ ఉపయుక్తంగా ఉంటుంది. ప్లే స్టోర్‌లోకి వెళ్లి పవర్‌ డైరెక్టర్‌ (power director) అని టైప్‌ చేసి డౌన్‌లోడ్‌ చేసి ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఇందులో వీడియో ఎడిటింగ్ చేసుకునేందుకు చాలా సదుపాయాలు, ప్రత్యేకతలు ఉన్నాయి. ట్రిమ్‌, వీడియో రొటేట్‌, బ్రైట్‌నెస్ కంట్రోల్‌, కలర్‌, వీడియో ఛేంజ్‌ ఆప్షన్లు ఉన్నాయి. వీడియోకు టెక్ట్స్‌, టైటిల్‌ కూడా పెట్టుకోవచ్చు. యాప్‌ను వారంపాటు ఫ్రీగా వాడుకోవచ్చు. ఆ తర్వాత డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. వాటిలో రకరకాల ప్యాకేజీలు ఉంటాయి. 


చాలా సింపుల్‌గా...

స్మార్ట్‌ఫోన్‌లో తేలికగా వీడియోలను ఎడిటింగ్‌ చేసుకోవడానికి FILMORAGO యాప్‌ సహకరిస్తుంది. సులభంగా వీడియోను ట్రిమ్‌ చేసి, టైటిల్స్‌, టెక్ట్స్‌ యాడ్‌ చేసుకోవచ్చు. స్టికర్స్‌, ఫిల్టర్స్‌ వంటి ఇతర ఎఫెక్ట్స్‌ను యాడ్‌ చేసుకునే అవకాశం ఉంది. ఇందులో ఫ్రీ వెర్షన్‌ కేవలం 360p, 480p, 720p రిజల్యూషన్‌తో వీడియోలను ఎడిట్‌ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ రిజల్యూషన్‌ కావాలంటే డబ్బులు కట్టాల్సిందే.


కిన్‌మాస్టర్‌ (KineMaster)

వీడియో ఎడిటింగ్‌ చేసేందుకు మరో యాప్‌ KineMaster. ఇందులో ఫొటోలు, వీడియోలు, టెక్ట్స్‌, ఇతర ఎఫెక్ట్స్‌ సంబంధించి వేర్వేరు లేయర్లను ఉపయోగించుకోవచ్చు. వీడియో బ్యాక్‌గ్రౌండ్‌ కలర్‌, లుక్ మార్చుకునేలా ఫీచర్లు ఉన్నాయి. వీడియోకు మ్యూజిక్‌, రికార్డెడ్‌ వాయిస్‌ను యాడ్‌ చేసుకునే అవకాశం ఉంది. ఈ యాప్‌తో హై రిసొల్యూషన్‌ వీడియో ఎడిటింగ్‌ కావాలంటే మాత్రం ఖర్చు పెట్టాల్సిందే. 


సామాజిక మాధ్యమాల్లో వీడియోల కోసం.. 

Quik.. పేరుకు తగ్గట్టే ఈ యాప్‌లో వీడియోను వేగంగా ఎడిట్‌ చేయొచ్చు. తక్కువ నిడివిగల వీడియోలను ఎడిట్‌ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి వీడియోలే ఎక్కువగా వినియోగిస్తుంటారు. కాబట్టి Quik యాప్‌ బాగా ఇందుకు నప్పుతుందనే చెప్పొచ్చు. వీడియోకు టెక్ట్స్‌, ఎమోజీలను యాడ్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. యాప్‌లో మ్యూజిక్‌ లైబ్రరీ ఉండటంతో వీడియోను ఎడిటింగ్‌ చేసేటప్పుడు కొత్తగా మ్యూజిక్‌ను తెచ్చి పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇందులోని నచ్చకపోతే అప్పుడు బయట నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 


పిక్సెల్‌ ఫ్లో.. 

ఒకసారి వీడియో ఎడిటింగ్ పూర్తయ్యాక.. మరికొన్ని టైటిల్స్‌ యాడ్‌ చేసుకునేందుకు Pixel Flow (పిక్సెల్‌ ఫ్లో) యాప్‌ ఉపయోగకరంగా ఉంటుంది. వీడియోకు పెద్ద సంఖ్యలో టైటిల్‌ యానిమేషన్స్‌ను అందించడం ఈ యాప్‌ ప్రధాన ఉద్దేశం. వీడియోకు యానిమేషన్లను యాడ్‌ చేసుకునే ముందు ప్రివ్యూ చూసుకునే అవకాశం ఉంది. ఆటలు, వంటలు, గేమ్స్‌‌, సాంకేతికత వంటి ఇతర అంశాలకు సంబంధించిన వీడియోలకు ఆయా వైవిధ్యమైన టైటిల్‌ యానిమేషన్లు ఉంటాయి. ఫ్రీ వెర్షన్‌లో కొన్ని టైటిల్స్‌ ఉంటాయి. మరిన్ని కావాలంటే ప్రీమియంతో అప్‌గ్రేడ్‌ కావాల్సిందే. 


-ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న