స్లిమ్‌ డిజైన్‌..స్టైలిష్‌ రంగుల్లో వివో వి20
close

Published : 18/09/2020 17:28 IST

స్లిమ్‌ డిజైన్‌..స్టైలిష్‌ రంగుల్లో వివో వి20


(ఫొటో: వివో)

ఇంటర్నెట్‌డెస్క్‌: స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ వివో త్వరలో మూడు కొత్త ఫోన్లను మార్కెట్లోకి తీసుకురానుంది. వివో వి20, వివో వి20 ఎస్‌ఈ, వివో వి20 ప్రో పేరుతో రానున్న ఈ ఫోన్లలో 5జీ టెక్నాలజీతో పాటు ట్రిపుల్ రేర్‌ కెమెరా, ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ వంటి ఫీచర్స్‌ ఉన్నాయి. ఈ మూడు ఫోన్లలో 6.44 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. అలానే ఆండ్రాయిడ్‌ 10 ఆధారిత ఫన్‌టచ్ఓఎస్‌ 11తో ఇవి పనిచేస్తాయి. ఈ ఫోన్ల ఇతర వివరాలు మీ కోసం..

వివో వి20

క్వాల్‌కోమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 720జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇందులో మొత్తం నాలుగు కెమెరాలు ఇస్తున్నారు. వెనక మూడు కెమెరాలు, ముందు ఒకటి ఉన్నాయి. వెనక వైపు 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 8ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్‌ కెమెరా ఇస్తున్నారు. ముందు భాగంలో సెల్ఫీల కోసం 44 ఎంపీ కెమెరా అమర్చారు. ఇందులో స్టడీ ఫేస్‌ సెల్ఫీ వీడియో, డ్యూయల్‌ వ్యూ వీడియో, సూపర్‌ నైట్ లైఫ్, స్లోమోషన్‌ సెల్ఫీ, 4కే సెల్ఫీ వంటి ఫీచర్లు ఉన్నాయి. 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 8జీబీ ర్యామ్‌/128జీబీ వేరియంట్లో, మిడ్‌నైట్ జాజ్‌, సన్‌సెట్‌ మెలోడి రంగుల్లో ఈ ఫోన్‌ లభించనుంది.

వివో వి20 ఎస్‌ఈ

ఇందులో క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 665 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. నాలుగు కెమెరాలు ఉన్నాయి. వెనక వైపు 48 మెగాపిక్సెల్‌ మెయిన్‌ కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్ కెమెరాతో పాటు 2మెగాపిక్సెల్‌ డెప్త్‌ సెన్సార్‌ కెమెరా ఇస్తున్నారు. సెల్ఫీల కోసం 32ఎంపీ కెమెరా అమర్చారు. ఇందులో సూపర్‌ నైట్‌ సెల్ఫీ, ఏఐ ఫేస్‌ బ్యూటీ, మల్టీ స్టైల్‌ పోట్రెయిట్‌, సాఫ్ట్‌లైట్‌ బ్యాండ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. 4,100 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 33వాట్ ఫ్లాష్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 8జీబీ ర్యామ్/128జీబీ వేరియంట్‌లో, గ్రావిటీ బ్లాక్, ఆక్సిజన్‌ బ్లూ రంగుల్లో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు.

వివో వి20 ప్రో

వి20 ప్రోలో మొత్తం ఐదు కెమెరాలు ఇస్తున్నారు. ముఖ్యంగా ముందు భాగంలో సెల్ఫీల కోసం రెండు కెమెరాలు ఉన్నాయి. వెనక వైపు 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 8ఎంపీ అల్ట్రా వైడ్‌యాంగిల్ కెమెరా, 2ఎంపీ డెప్త్‌ సెన్సార్‌ కెమెరా ఇస్తున్నారు. ముందు 44 మెగాపిక్సెల్, 8ఎంపీ కెమెరాలు అమర్చారు. ఈ ఫోన్‌లో క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 765 ప్రాసెసర్‌ ఉపయోగించారు. 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీన్ని ఏ వేరియంట్లో, ఎన్ని రంగుల్లో తీసుకురానున్నారనేది తెలియాల్సి ఉంది. 

కెమెరా ప్రాధాన్యంగా వివో తీసుకొస్తున్న ఈ మోడల్స్‌ని అక్టోబరు నెలలో భారత మార్కెట్లో విడుదల చేయనున్నారు. అంతకు ముందే సెప్టెంబరు 21 తేదీన థాయిలాండ్‌లో, సెప్టెంబరు 24 తేదీన ఇండోనేషియా మార్కెట్లలో ప్రవేశపెట్టనున్నారు. వీటి ధరపై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న