ఉత్తమ ‘పవర్‌’ బ్యాంక్‌లు.. తెలుసుకోండిలా..!
close

Published : 06/12/2020 18:28 IST

ఉత్తమ ‘పవర్‌’ బ్యాంక్‌లు.. తెలుసుకోండిలా..!

ఇంటర్నెట్‌ డెస్క్: స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం పెరగడంతో ఛార్జింగ్ సమస్యా ఎక్కువైంది. ఫోన్‌లో ఛార్జింగ్ తక్కువగా ఉందంటే ఠక్కున గుర్తుకొచ్చేవి ఛార్జర్‌, పవర్‌బ్యాంకులు. అయితే ఛార్జర్‌ కేబుల్‌ ఉన్నా ఎక్కడ పడితే అక్కడ పెట్టుకునే వీలు ఉండకపోవచ్చు. అదే పవర్‌ బ్యాంక్‌ వెంట ఉంటే హాయిగా ఫోన్‌ను వాడుకోవచ్చు. ఇంట్లోనే పవర్‌ బ్యాంక్‌ను ఛార్జ్‌ చేసుకుని వస్తాం కాబట్టి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. అయితే మంచి పవర్‌ బ్యాంక్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. చవకగా వచ్చాయని ఏది పడితే అది తీసుకోకూడదు. ఛార్జింగ్ బ్యాకప్‌ ఎక్కువగా ఉండాలి. అంతేకాకుండా ఫోన్ త్వరగా ఛార్జ్‌ అయ్యేలా సపోర్ట్‌ అందించే పవర్‌ బ్యాంక్‌ను తీసుకుంటేనే ఉత్తమం. ఆయా కంపెనీల పవర్‌ బ్యాంక్‌ల ధరలు వేర్వేరుగా ఉంటాయి. గమనించి తీసుకోవాల్సి ఉంటుంది. మరి అలాంటి పవర్‌ బ్యాంక్‌ల గురించి ఓ లుక్కేద్దామా...

ఒకేసారి మూడు డివైస్‌లకు.. 

షావోమీ నుంచి కొత్తగా విడుదలైన పవర్‌ బ్యాంకుల్లో MI పవర్ బ్యాంక్‌ 3I 20000mAh ఒకటి. దీని ప్రత్యేకత ట్రిపుల్‌ పోర్ట్‌ అవుట్‌పుట్‌. అంటే ఒకేసారి మూడు డివైజ్‌‌లకు ఛార్జింగ్‌ పెట్టుకోవచ్చు. అంతేకాకుండా రెండు ఇన్‌పుట్‌ పోర్ట్‌లు ఉంటాయి. టైప్‌-సి కేబుల్‌ ద్వారా కానీ మైక్రో యూఎస్‌బీ కేబుల్‌ ద్వారా ఛార్జ్‌ చేయొచ్చు. వేగవంతంగా ఛార్జింగ్‌ చేసేందుకు 18w ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సంస్థ అందుబాటులోకి తెచ్చింది. 12 లేయర్స్‌తో ఓవర్‌హీటింగ్‌, షార్ట్‌ సర్క్యూట్‌ ప్రమాదాల నుంచి రక్షణ కలిగి ఉంది. 

స్క్రాచ్‌ల నుంచి రక్షణగా.. 

ముందస్తు ప్రమాదాల నుంచి రక్షణగా ఉండేందుకు తొమ్మిది లేయర్లతో  Ambrane PP-150 పవర్‌ బ్యాంక్‌ తయారైంది. 15000 mAh కెపాసిటీతో 2.1A ఫాస్ట్‌ ఛార్జింగ్‌. డ్యూయల్‌ యూఎస్‌బీ అవుట్‌పుట్‌తో రెండు ఫోన్లకు ఛార్జింగ్‌ పెట్టుకోవచ్చు. దీనికి కూడా టైప్‌-సి కేబుల్‌ ద్వారా కానీ, మైక్రో యూఎస్‌బీ కేబుల్‌తో ఛార్జ్‌ చేసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా రబ్బర్ ఫినిషింగ్‌ ఇవ్వడంతో గీతలు, స్క్రాచ్‌ల నుంచి కాపాడుకోవచ్చు. 

రెడ్‌మీ పవర్‌ బ్యాంక్..

రెడ్‌మీ పవర్‌ బ్యాంక్‌ 20000 mAh కెపాసిటీ 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో విపణిలో అందుబాటులో ఉంది. డ్యూయల్‌ ఇన్‌పుట్‌, అవుట్‌పుట్‌ పోర్ట్‌లతో ఒకేసారి రెండు డివైజ్‌‌లకు ఛార్జింగ్‌ పెట్టుకోవచ్చు. ఇందులోనూ షార్ట్‌ సర్క్యూట్‌ వంటి వాటి నుంచి రక్షణగా 12 లేయర్స్‌  ప్రొటెక్షన్‌ ఉంది. రెడ్‌మీ పవర్‌ బ్యాంక్‌కు ప్రత్యేకత.. బ్లూటూత్‌, హెడ్‌సెట్స్‌, ఫిట్‌నెస్‌ బ్యాండ్స్‌ను కూడా ఛార్జ్‌ చేసుకోవచ్చు. 

10000 mAh కెపాసిటీతో.. 

ఒన్‌ ప్లస్‌ సంస్థ లేటెస్ట్‌గా విడుదల చేసిన పవర్‌ బ్యాంక్‌. ఒన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ రంగు అయిన లేత ఆకుపచ్చ రంగులో పవర్‌ బ్యాంక్ ఉంటుంది. 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ 10000 mAh కెపాసిటీతో యూఎస్‌బీ పవర్‌ డెలివరీ ప్రత్యేకలతో ఒన్‌ప్లస్‌ ఈ పవర్‌ బ్యాంక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్లూటూత్‌, హెడ్‌ఫోన్స్‌ను ఛార్జింగ్‌ చేసుకునే అవకాశం ఉంది. 12 లేయర్ల సర్క్యూట్‌ ప్రొటెక్షన్‌తో ఒన్‌ప్లస్ పవర్‌ బ్యాంక్ యూజర్లను ఆకట్టుకుంటోంది. 

హై డెన్సిటీ బ్యాటరీ..

రియల్‌మీ పవర్‌ బ్యాంక్‌ 10000mAh కెపాసిటీ, 18w ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఒకే సారి రెండు డివైజ్‌లను చార్జ్‌ చేసుకోవచ్చు. ప్రమాదాలను నివారించడానికి 12 లేయర్ల సర్క్యూట్ రక్షణతో వస్తుంది. ఇది హై డెన్సిటీ కలిగిన బ్యాటరీతో వస్తుంది కాబట్టి 500 రీఛార్జ్లు అయిన తర్వాత కూడా దాని సామర్థ్యం 100శాతానికి తగ్గదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న