వాట్సాప్‌ డిస్‌అపియరింగ్ ఫీచర్ వచ్చేసింది
close

Published : 05/11/2020 21:45 IST

వాట్సాప్‌ డిస్‌అపియరింగ్ ఫీచర్ వచ్చేసింది

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాట్సాప్‌ యూజర్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ‘డిస్‌అపియరింగ్ మెసేజస్‌’ ఫీచర్‌ను ఎట్టకేలకు వాట్పాప్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు వాట్సాప్‌ గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈ ఫీచర్‌తో యూజర్స్‌ తాము పంపే మెసేజ్‌లను ఏడు రోజుల తర్వాత వాటంతట అవే డిలీట్ అయిపోయేలా చెయ్యొచ్చు. గత కొంత కాలంగా పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను ఈ నెల నుంచి ఆండ్రాయిడ్, ఐఓఎస్‌, లైనెక్స్‌ ఆధారిత కెఏఐఓఎస్‌ యూజర్స్‌తో పాటు వాట్సాప్‌ వెబ్‌/డెస్క్‌టాప్‌ వెర్షన్‌లో కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది.

‘‘వాట్సాప్‌లో జరిగే సంభాషణల ద్వారా మనకు కావాల్సిన వారు పక్కన లేకున్నా ఎప్పటికీ మనతో ఉన్నారనే భావనను కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. అందులో భాగంగానే డిస్‌ అపియరింగ్ మెజేజస్‌ అనే కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తున్నాం. వాట్సాప్‌లో ఈ ఫీచర్‌ను ఆన్‌ చేస్తే యూజర్స్‌ కొత్తగా పంపే మెసేజ్‌లు ఏడు రోజుల తర్వాత వాటంతటవే డిలీట్ అయిపోతాయి. దీని వల్ల సంభాషణలు మరింత వ్యక్తిగతంగా, సులభంగా జరిగేందుకు సహాయపడతాయి’’ అని వాట్సాప్‌ తెలిపింది. ఈ కొత్త ఫీచర్‌తో వ్యక్తిగత ఛాట్‌లతో పాటు గ్రూప్‌ ఛాట్‌లను డిలీట్ చెయ్యొచ్చు. అయితే గ్రూప్‌ ఛాట్‌లో ఈ ఫీచర్‌ ఉపయోగించే అవకాశం కేవలం గ్రూప్ అడ్మిన్‌లకు మాత్రమే ఉంటుంది.

ఏడు రోజుల వ్యవధిలో మెసేజ్‌లు డిలీట్ ఫీచర్‌ యూజర్స్‌కి కొంత వరకు ప్రశాంతతను చేకూరుస్తుందని వాట్సాప్‌ పేర్కొంది. దాని వల్ల వ్యక్తులు లేదా గ్రూపుల మధ్య జరిగిన సంభాషణలు ఎక్కువ రోజుల పాటు గుర్తుంచుకునే అవకాశం ఉండదని వాట్సాప్ తెలిపింది. అలానే ఈ వారం మొదట్లో కొత్తగా స్టోరేజ్‌ మేనేజ్‌మెంట్ ఫీచర్‌ను పరిచయం చేస్తున్నట్లు కూడా వాట్సాప్‌ ప్రకటించింది. దీంతో బల్క్‌గా కంటెంట్‌ను డిలీట్ చేసి స్టోరేజ్‌ కెపాసిటీని పెంచుకోవచ్చు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న