షావోమిపై నెటిజన్లు ఫైర్‌..ఎందుకంటే..?
close

Published : 28/12/2020 18:34 IST
షావోమిపై నెటిజన్లు ఫైర్‌..ఎందుకంటే..?

ఇంటర్నెట్‌ డెస్క్: ఎంఐ 11 పేరుతో షావోమి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ ఫోన్‌లో క్వాల్‌కోమ్‌ కొత్త 5జీ ప్రాసెసర్‌ స్నాప్‌డ్రాగన్‌ 888ను పరిచయం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఫోన్‌ ప్యాక్‌లో యూఎస్‌బీ అడాప్టర్‌ను తొలగిస్తున్నట్లు షావోమి ప్రకటించింది. దీంతో షావోమి నిర్ణయంపై మొబైల్ వినియోగదారులు సామాజిక మాధ్యమాలు వేదికగా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. షావోమి ఎప్పటిలానే యాపిల్ కంపెనీని కాపీ కొడుతోందని ఎద్దేవా చేశారు. షావోమి తాజా నిర్ణయంపై సీఈవో లీ జున్ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటన చేశారు. ‘‘కంపెనీ పర్యావరణ లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగా ఎంఐ 11 ఫోన్‌లో ఛార్జర్‌ అడాప్టర్‌ను తొలగిస్తున్నాం’’ అని తెలిపారు. 

గతంలో ఐఫోన్ 12 విడుదల సందర్భంగా యాపిల్‌ యూఎస్‌బీ అడాప్టర్‌, ఇయర్‌ఫోన్స్‌ను ఫోన్‌తో పాటు ఇవ్వటంలేదని ప్రకటించింది. అప్పట్లో యాపిల్‌ నిర్ణయాన్ని ఎద్దేవా చేస్తూ షావోమి ట్వీట్ చేసింది. తమ కంపెనీ విడుదల చేసే ఫోన్లలో అన్ని ఉంటాయని, తమ ఫోన్‌ ప్యాక్‌లో ప్రతి యాక్ససరీ ఉంటుందని ట్వీట్ చేసింది. అయితే షావోమి తాజా నిర్ణయంతో నెటిజన్లు పాత ట్వీట్‌ను షేర్ చేస్తూ షావోమిపై విమర్శలు చేస్తున్నారు. యాపిల్‌ను షావోమి అనుకరిస్తుందని కామెంట్లు చేస్తున్నారు. అలానే త్వరలో శాంసంగ్ ఇదే తరహా నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని టెక్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న