షావోమి కొత్త సాఫ్ట్‌వేర్‌ ఫీచర్స్‌ వీడియో లీక్‌..
close

Published : 27/09/2020 22:50 IST
షావోమి కొత్త సాఫ్ట్‌వేర్‌ ఫీచర్స్‌ వీడియో లీక్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌: వరుస లాంఛ్‌లతో అదరగొడుతున్న షావోమి..వినియోగదారులకు ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో కొత్త ఉత్పత్తులు అందివ్వడంలో కూడా అంతే దూకుడు ప్రదర్శిస్తోంది. ఇటీవలే ఆండ్రాయిడ్‌ 11 ఆధారంగా పనిచేసే ఎంఐయుఐ 12 సాఫ్ట్‌వేర్‌ను షావోమి, రెడ్‌మీ ఫోన్ యూజర్స్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా ఎంఐయుఐ 13 సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. 2021 ద్వితీయార్ధంలో దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఎంఐయుఐ 13 ఇంటర్‌ఫేస్‌ పేరుతో ఒక వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. పోర్టల్‌టెలీ అనే యుట్యూబ్‌ ఛానల్ ఈ వీడియోను షేర్ చేసింది. 8 సెకన్ల వీడియోలో కొత్త సాఫ్ట్‌వేర్‌లో ఫోన్ షట్‌డౌన్‌, రిస్టార్ట్‌ ఎలా అవుతుందనేది చూపించారు. కొద్ది వారాల క్రితం ఈ ఫీచర్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ నెట్లో సందడి చేశాయి. త్వరలోనే షావోమి ఎంఐయుఐ 13కి సంబంధించి ప్రకటన చేయనుందని టెక్‌ వర్గాలు తెలిపాయి.

షావోమి కొత్త సాఫ్ట్‌వేర్‌ను ముందుగా అందుబాటులోకి వచ్చే మోడల్స్ ఇవేనంటూ కొన్ని టెక్‌ వెబ్‌సైట్లు ఒక జాబితాను ప్రచురించాయి. వీటిలో ఎంఐ నోట్ 10 సిరీస్, ఎంఐ మిక్స్‌2 ఫోన్ల నుంచి రెడ్‌మీ పాత తరం ఫోన్లు రెడ్‌మీ 4, రెడ్‌మీ నోట్ 4తో పాటు రెడ్‌మీ నోట్ 8, నోట్ 5, నోట్ 6, 7ఏ, వై1, 6ఏ, 6ప్రో, 8ఏ, కే20, కే30 సిరీస్‌ పోన్లు, పొకో ఎఫ్‌1, ఎక్స్‌2లు ఉన్నాయి. అయితే ఈ జాబితాలో 2020లో బాగా పాపులర్ అయిన రెడ్‌మీ నోట్ 9 సిరీస్‌ పేరు లేకపోవడం షావోమి యూజర్స్‌ని ఆశ్చర్యానికి గురిచేసింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న