షావోమి కొత్త ఫోన్..ఎటు తిప్పినా డిస్‌ప్లేనే..!
close

Updated : 22/12/2020 18:56 IST
షావోమి కొత్త ఫోన్..ఎటు తిప్పినా డిస్‌ప్లేనే..!

(Photo Credit: LetsGo Digital)

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌-19 ప్రభావంతో మందగించిన మొబైల్ మార్కెట్‌లో వరుస లాంఛ్‌లతో కొద్ది నెలలుగా సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో మొబైల్ కంపెనీలు కొత్త ఉత్పత్తులను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ముఖ్యంగా షావోమి కంపెనీ సరికొత్త ఫీచర్స్‌, వినూత్న డిజైన్‌లతో స్మార్ట్‌ఫోన్‌ ప్రియులను ఎప్పటికప్పుడు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది షావోమి. తాజాగా షావోమి సరౌండ్ డిస్‌ప్లే, పాప్‌-అప్ కెమెరాతో కొత్త ఫోన్‌ను తీసుకురానుంది. ఈ మేరకు షావోమి కొత్త ఫోన్‌కు సంబంధించిన డిజైన్ ఆకృతులు నెట్‌లో సందడి చేస్తున్నాయి. ఇప్పటికే షావోమి ఈ డిజైన్‌ తయారీకి సంబంధించి పేటెంట్ పొందినట్లు లెట్స్‌గో డిజిటల్ అనే టెక్‌ సంస్థ వెల్లడించింది.  

నిజానికి షావోమి గతేడాదే ఎంఐ ఎంఐఎక్స్‌ అల్ఫా పేరుతో ఈ ఫోన్‌కు సంబంధించిన డిజైన్‌ ఆకృతులను విడుదల చేసింది. కానీ..వీటి తయారీపై మాత్రం దృష్టి సారించలేదు. ప్రస్తుతం మార్కెట్లో పూర్తి స్థాయి డిస్‌ప్లే ఫోన్లకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఈ ఫోన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమయింది. తొలి దశలో భాగంగా పరిమిత సంఖ్యలో ఈ ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేయనున్నారట. షావోమి డిజైన్‌ ప్రకారం ఫోన్‌ ముందు, వెనక వైపు, చుట్టు పక్కల కూడా డిస్‌ప్లే ఇస్తున్నారు. దానితో పాటు పాప్‌-అప్‌ ఫీచర్‌తో ట్రిపుల్‌ కెమెరా, డ్యూయల్‌-ఎల్‌ఈడీ ఫ్లాష్‌ లైట్లను ఇస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇక ఫోన్‌ పై భాగంలో పాప్‌-కెమెరాలతో పాటు పవర్‌ బటన్‌, సెకండరీ మైక్రోఫోన్ ఉన్నాయి. ఫోన్ కింది భాగంలో యుఎస్‌బీ టైప్‌-సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్, ప్రైమరీ మైక్రోఫోన్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌ను అమర్చారు. క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్‌ 865 ప్రాసెసర్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎప్పటిలోపు ఈ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నారనే దానిపై పూర్తి సమాచారం లేదు. త్వరలోనే షావోమి దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని టెక్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

ఇదీ చదవండి..

5జీ ఫోన్ కొనాలా..ఇదిగో జాబితా..!

మధ్యశ్రేణి మార్కెట్‌ లక్ష్యంగా పొకో కొత్త ఫోన్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న