యూట్యూబ్‌లో మరో కొత్త ఫీచర్‌..వారికి మాత్రమే..!
close

Published : 21/12/2020 18:25 IST
యూట్యూబ్‌లో మరో కొత్త ఫీచర్‌..వారికి మాత్రమే..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫాం యూట్యూబ్ యూజర్స్‌ మెరుగైన సేవలందించేందుకు ఎప్పటికప్పడు కొత్త ఫీచర్స్‌ని పరిచయం చేస్తుంది. ఇటీవల వీడియోలకు వచ్చే అసభ్య వ్యాఖ్యలు మరొకరు షేర్ చేయకుండా వార్నింగ్ లేబుల్ తరహా ఫీచర్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వీడియోలను సులభంగా డౌన్‌లోడ్‌ చేసుకునేలా మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. దీని సహాయంతో ఒక డివైజ్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న వీడియోలను మరో డివైజ్‌లోని డౌన్‌లోడ్స్‌లో కూడా సేవ్‌ చేసుకోవచ్చు. ఉదాహరణకి మీరు మీ ఫోన్‌లో యూట్యూబ్ నుంచి వీడియో డౌన్‌లోడ్ చేశారు. అది డివైజ్‌లో సేవ్‌ అయ్యేప్పుడు మీకు స్క్రీన్‌ మీద పాప్‌-అప్‌ విండో ప్రత్యక్షమవుతుంది. అందులో మీరు లాగిన్ అయిన డివైజ్‌ల జాబితా చూపిస్తుంది. అందులో ఒకటి లేదా మొత్తం డివైజ్‌లను సెలెక్ట్ చేస్తే వీడియో వాటిలో కూడా సేవ్‌ అవుతుంది.

ఇందుకోసం మీ డివైజ్‌ సెట్టింగ్స్‌లో బ్యాక్‌గ్రౌండ్‌ అండ్ డౌన్‌లోడ్స్‌లోకి వెళ్లి క్రాస్‌ డివైజ్‌ ఆఫ్‌లైన్‌ సెట్టింగ్స్‌లో మార్పులు చేయాల్సి ఉంటుందని టెక్ వర్గాలు తెలిపాయి. అయితే ఈ కొత్త ఫీచర్‌ కేవలం యూట్యూబ్ ప్రీమియం యూజర్స్‌కి మాత్రమే పరిమితమని తెలుస్తోంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ ఇప్పటికే పలువురు ఆండ్రాయిడ్‌ యూజర్స్‌కి అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. దీని వల్ల యూజర్స్‌ ఒకే సారి తమకు నచ్చిన వీడియోలను ఎక్కడి నుంచైనా సేవ్ చేసుకుని నచ్చినప్పుడు వాటిని చూడొచ్చని టెక్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

ఇవీ చదవండి..

అలాంటి వారికి..యూట్యూబ్ వార్నింగ్ 

యూట్యూబ్‌ ఉందిగా.. నేర్చేద్దాం పదండిక..!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న