అలాంటి వారికి..యూట్యూబ్ వార్నింగ్
close

Published : 04/12/2020 23:14 IST
అలాంటి వారికి..యూట్యూబ్ వార్నింగ్

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రస్తుతం సామాజిక మాధ్యమాలను నకిలీ వార్తలు, అసభ్య వ్యాఖ్యల సమస్య తీవ్రంగా వేధిస్తుంది. వీటిని అధిగమించి యూజర్స్‌కి మెరుగైన సేవలు అందించేందుకు సోషల్ మీడియా సంస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఫేస్‌బుక్‌ వార్నింగ్ లేబుల్స్‌ అస్త్రాన్ని ప్రయోగిస్తుంటే, ట్విటర్‌ డిస్‌ప్యూటెడ్ ట్వీట్‌ ఫీచర్‌తో వాటికి చెక్ పెడుతున్నాయి. తాజాగా యూట్యూబ్ కూడా అభ్యంతరకర వ్యాఖ్యలకు చెక్ పెట్టేందుకు కొత్త టూల్ తీసుకురానుంది. ఏదైనా వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు కొంత మంది అసభ్య వ్యాఖ్యలు చేస్తుంటారు. వాటిని తొలగించి యూజర్స్‌కి మెరుగైన సేవలు అందించడంలో భాగంగా యూట్యూబ్ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. ఇక మీదట ఎవరైనా వీడియో కామెంట్ సెక్షన్‌లో అభ్యంతరకర వ్యాఖ్యలను పోస్ట్ చేయాలని ప్రయత్నిస్తే ‘మీరు నిజంగా దీన్ని షేర్‌ చేయాలనుకుంటున్నారా ?’ అని యూట్యూబ్‌  మిమ్మల్ని హెచ్చరిస్తుంది.

(Photo Credit: Youtube Blog)

ఈ ఫీచర్ యూజర్ కామెంట్ చేయకుండా ఆపలేకపోయినప్పటికీ అసభ్య వ్యాఖ్యలు పోస్ట్‌ చేసేముందు ఒకసారి ఆలోచించి వాటిలో మార్పులు చేసుకునే అవకాశం ఉంటుందని యూట్యూబ్ తెలిపింది. అలానే యూట్యూబ్ స్టూడియోలో వీడియోలు రూపొందించే వారి కోసం కామెంట్ ఫిల్టరింగ్ ఫీచర్‌ను ప్రవేశపెడుతున్నారు. దీని ద్వారా యూట్యూబ్  ఛానెల్‌లో ఉన్న వీడియోలకు ఏవైనా అసభ్య కామెంట్లు  వస్తే వాటిని యూట్యూబ్‌ పరిశీలించి తొలగిస్తుంది. అలా వాటిని ఇతరులు చదవకుండా చేయొచ్చు. ముందుగా ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురానున్నారు. 2019 నుంచి రోజుకి 46 సార్లు ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన కామెంట్స్‌ను తొలగిస్తున్నట్లు యూట్యూబ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. గత త్రైమాసికంలో 1.8 మిలియన్‌ ఛానెల్స్‌ నుంచి అభ్యంతరకర వీడియోలను తొలగించినట్లు వెల్లడించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న