యూట్యూబ్‌ సేవలకు అంతరాయం..పునరుద్ధరణ
close

Published : 12/11/2020 18:23 IST
యూట్యూబ్‌ సేవలకు అంతరాయం..పునరుద్ధరణ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫాం యూట్యూబ్ సేవలకు గురువారం కొద్ది సేపు అంతరాయం కలిగింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రెండు గంటల పాటు యూట్యూబ్‌లో ఎలాంటి వీడియోలు ప్లే కాలేదు. దీంతో పలువురు యూజర్స్‌ సామాజిక మాధ్యమాల ద్వారా తమ అసహానాన్ని తెలియజేస్తూ ట్వీట్లు చేశారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 5 నుంచి 8 గంటల ప్రాంతంలో ఈ సమస్య తలెత్తినట్లు ఇంటర్నెట్ అంతరాయానికి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించే డౌన్‌డైరెక్టర్‌.కామ్‌ అనే వెబ్‌సైట్ తెలిపింది. యూట్యూబ్‌తో పాటు యూట్యూబ్ టీవీ, గూగుల్‌ టీవీ సేవలు కూడా నిలిచిపోయాయని.. కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలోనే సమస్యను ప్రస్తావిస్తూ సుమారు 2,86,000పైగా ఫిర్యాదులు నమోదయాయని డౌన్‌డైరెక్టర్‌ తెలిపింది.

అయితే ఈ సమస్యను రెండు గంటల వ్యవధిలోనే సమస్యను పరిష్కరించినట్లు యూట్యూబ్ తన అధికారిక ట్విటర్‌ ఖాతా ద్వారా వెల్లడించింది. ‘‘అంతరాయానికి క్షమించాలి. యూట్యూబ్ సేవల్లో తలెత్తిన సమస్యను మేం పరిష్కరించాం. మీరు తిరిగి మా సేవలను పొందొచ్చు. ఇంతసేపు ఓపిగ్గా ఉన్నందుకు ధన్యవాదాలు’’ అని ట్వీట్ చేసింది. అలానే ఇప్పటికీ ఎవరైనా యూజర్స్‌కి ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే తమ సాంకేతిక బృందం వారికి సహాయం చేస్తుందని యూట్యూబ్‌ తెలిపింది. అయితే యూట్యూబ్‌ సేవలకు అంతరాయమేర్పడటంపై నెటిజన్స్‌ సామాజిక మాధ్యమాల్లో మీమ్స్‌తో తమ వైఖరిని తెలియజేస్తూ ట్వీట్లు చేశారు. చాలా మంది తమ నెట్‌వర్క్‌లో సమస్య తలెత్తిందేమోనని భావించామని, ట్విటర్‌ వేదికగా ఎప్పుడైతే ఫిర్యాదులు వచ్చాయో ఇది యూట్యూబ్‌ సమస్య అని తెలుసుకున్నామని ట్వీట్ చేశారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న