Adobe Photoshop: ఉచితంగా ఫొటోషాప్‌ వెబ్ వెర్షన్‌..కానీ! 
close

Updated : 29/10/2021 10:32 IST

Adobe Photoshop: ఉచితంగా ఫొటోషాప్‌ వెబ్ వెర్షన్‌..కానీ! 

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫోటోషాప్‌ యూజర్స్‌ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఫొటోషాప్‌ వెబ్‌ వెర్షన్‌ త్వరలో యూజర్స్‌కి అందుబాటులోకి రానున్నట్లు అడోబ్ వెల్లడించింది. దీంతో యూజర్స్‌ తమ కంప్యూటర్లలో ఫొటోషాప్‌ డౌన్‌లోడ్‌ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఏదైనా వెబ్‌ బ్రౌజర్‌ ఓపెన్ చేసి ఫొటోషాప్‌ వెబ్‌లో ఫొటోలు ఎడిట్ చేసుకోవచ్చు. క్లౌడ్ ఆధారంగా వెబ్ వెర్షన్‌ ఫొటోషాప్ పనిచేస్తుంది. ఫొటోషాప్‌ వెబ్‌లో ఎడిట్‌ చేసిన ఫొటోలను యూజర్స్‌ వారి క్లౌడ్‌ ఖాతాలో సేవ్‌ చేసుకోవచ్చు. అలానే ఇల్యుస్ట్రేషన్‌ యాప్‌ని కూడా వెబ్‌ వెర్షన్‌లో తీసుకురానున్నట్లు అడోబ్ ప్రకటించింది. ఫొటోషాప్ వెబ్‌ తరహాలోనే ఇల్యుస్ట్రేషన్‌ని కూడా ఆన్‌లైన్‌లో ఉపయోగించుకోవచ్చు. ఈ రెండింటి వెబ్‌ వెర్షన్‌ కోసం అడోబ్‌ కొత్తగా ‘క్రియేటివ్‌ క్లౌడ్‌ వెబ్‌’ అనే క్లౌడ్‌ సేవలను పరిచయం చేసింది. ఇది క్రియేటివ్‌ క్లౌడ్ స్పేసెస్‌, క్రియేటివ్‌ క్లౌబ్ కాన్వాస్‌ అనే రెండు సేవలను అందిస్తుంది. దీని సాయంతో రెండు వేర్వేరు ప్రాజెక్టుల కోసం పనిచేస్తున్న బృందాలు వెబ్‌లో కలిసి పనిచేయొచ్చు.

అలానే ఫొటోషాప్‌, ఇల్యుస్ట్రేషన్‌లను ఏ వెబ్ బ్రౌజర్ నుంచైనా ఉపయోగించవచ్చు. డెస్క్‌టాప్ వెర్షన్‌లో ఉండే అన్ని రకాల ఫొటో ఎడిటింగ్ టూల్స్‌ వెబ్‌ వెర్షన్‌లో కూడా అందబాటులో ఉంటాయి. ఫొటో ఎడిటింగ్ పూర్తయిన తర్వాత గూగుల్ డాక్స్‌ లేదా ఇతర క్లౌడ్‌ సేవల నుంచి లింక్‌లు షేర్ చేసినట్లుగానే ఫొటోషాప్‌ వెబ్‌ లింక్‌ను ఇతరులతో షేర్ చేసుకోవచ్చు. అయితే అడోబ్‌ అందించే క్లౌడ్ సేవలు పొందాలంటే మాత్రం యూజర్‌ సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సిందే. ఈ వెబ్‌ వెర్షన్స్ ద్వారా ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా తాము ఎడిట్ చేసిన ఫొటోలను యాక్సెస్‌ చేసుకోవడంతోపాటు ఇతరులతో కూడా సులువుగా షేర్ చేసుకోవచ్చు. 

 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న