5జీ ట్రయల్స్‌ ప్రారంభించిన ఎయిర్‌టెల్‌
close

Published : 14/06/2021 20:38 IST
5జీ ట్రయల్స్‌ ప్రారంభించిన ఎయిర్‌టెల్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ 5జీ నెట్‌వర్క్‌కు సంబంధించిన ట్రయల్స్‌ను ప్రారంభించింది. టెలికాం విభాగం (డాట్‌) అనుమతిచ్చిన నెల రోజులకే గురుగ్రామ్‌లోని సైబర్‌ హబ్‌ ప్రాంతంలో ఈ పరీక్షలను జరిపింది. డాట్‌ నుంచి అనుమతి పొందిన సంస్థల్లో ట్రయల్స్‌ ప్రారంభించిన తొలి సంస్థగా ఎయిర్‌టెల్‌ నిలిచింది. ట్రయల్స్‌ సందర్భంగా 1జీబీ వేగంతో డేటా బదిలీ అయినట్లు తెలిసింది. త్వరలో ఇదే తరహాలో ముంబయిలో సైతం ఎయిర్‌టెల్‌ పరీక్షలు నిర్వహించనుంది. ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, దిల్లీ టెలికాం సర్కిళ్లలో 5జీ ట్రయల్స్‌ నిర్వహణకు డాట్‌ ఎయిర్‌టెల్‌కు అనుమతిచ్చింది.

ఎయిర్‌టెల్‌తో పాటు జియో, వొడాఫోన్‌ ఐడియా, ఎంటీఎన్‌ఎల్‌ 5జీ ట్రయల్స్‌లో పాల్గొననున్నాయి. ఎయిర్‌టెల్‌ స్వీడన్‌కు చెందిన ఎరిక్సన్‌తో జట్టుకట్టి ఈ ప్రయోగాలు చేపడుతుండగా.. జియో 5జీ సొంతంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీని వినియోగించనుంది. జియో సహా మిగిలిన సంస్థలు ట్రయల్స్‌ ఇంకా ప్రారంభించాల్సి ఉంది. 5జీ పరీక్షలకు అవసరమైన సామగ్రిని సమకూర్చుకునే సమయాన్ని కలుపుకొని మొత్తం ఆరు నెలల పాటు ఈ ట్రయల్స్‌ కొనసాగనున్నాయి.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న