Apple: ఉచితంగా ఎయిర్‌పాడ్స్... వారికి మాత్రమే..!
close

Published : 17/07/2021 00:00 IST
Apple: ఉచితంగా ఎయిర్‌పాడ్స్... వారికి మాత్రమే..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: యాపిల్ ఉత్పత్తులు కొనుగోలు చేసేవారికి ఆ సంస్థ శుభవార్త చెప్పింది. మ్యాక్‌ లేదా ఐపాడ్ కొనుగోలు చేసే విద్యార్థులకు ఎడ్యుకేషనల్ ఆఫర్ కింద యాపిల్ ఎయిర్‌పాడ్స్ ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపింది. యాపిల్ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా భారతీయ యూజర్స్ ఈ ఆఫర్‌ కింద కొనుగోళ్లు చేయవచ్చని వెల్లడించింది. కొత్తగా కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చేరిన విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులు, బోధనా సిబ్బంది ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చని తెలపింది. అర్హులైన వారు తమ గుర్తింపు కార్డును యాపిల్ యూనిడేస్ ఫ్లాట్‌ఫాం లేదా యాపిల్‌ స్పెషలిస్ట్ ద్వారా చెక్ చేయించుకోవాలి. 

మ్యాక్‌బుక్ ఎయిర్‌, మ్యాక్‌బుక్ ప్రో, ఐమ్యాక్, మ్యాక్ ప్రో, మ్యాక్ మినీ, ఐపాడ్ ప్రో, ఐపాడ్ ఎయిర్‌లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. దీనితోపాటు ఎయిర్‌పాడ్ వైర్‌లెస్ ఛార్జింగ్ కేస్‌ను ₹4,000కు, ఎయిర్‌పాడ్స్‌ ప్రో వైర్‌లెస్ ఛార్జింగ్‌ కేస్‌ను ₹10,000కు సొంతం చేసుకోవచ్చు. వీటితోపాటు కిడ్డోపియా, సింప్లీ పియానో, డిస్నీ బైజూస్, హెడ్‌వే, లింగోకిడ్స్ వంటి ఎడ్యుకేషనల్ యాప్‌లపై కూడా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఇవేకాకుండా యాపిల్‌కేర్‌ ఎక్స్‌డెండ్ వారంటీపై 20 శాతం, యాపిల్ పెన్సిల్, మ్యాజిక్ కీ బోర్డ్, యాపిల్ టీవీ ప్లస్‌, యాపిల్ ఆర్కేడ్‌లపై కూడా ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న