మీ ఫోన్‌ నుంచి మెసేజ్‌లు వెళ్లడం లేదా... 
close

Published : 11/12/2020 15:00 IST
మీ ఫోన్‌ నుంచి మెసేజ్‌లు వెళ్లడం లేదా... 

అయితే ఈ సమస్య మీ ఒక్కరిదే కాదు...

ఇంటర్నెట్‌ డెస్క్‌:  ఇప్పుడు మెసేజ్‌ల వాడకం తగ్గిపోయింది కానీ... మామూలుగా అయితే ఇది చాలా పెద్ద సమస్యే. ప్రముఖ మొబైల్ సంస్థల స్మార్ట్‌ ఫోన్లలో గత కొద్ది రోజులుగా మెసేజ్‌లు వెళ్లడం లేదు.. రావడం లేదు. ఒక్కోసారి మెసేజ్‌ సెండ్‌ అయినా... 30 నిమిషాల తర్వాత అవతలి వ్యక్తికి చేరుతోందట. ఈ ఇబ్బంది ఉన్న మొబైల్స్‌లో ఎల్‌జీ, వన్‌ప్లస్‌, శాంసంగ్‌ ఉన్నాయి. ఒకవేళ మీరూ ఈ మొబైల్స్‌ వాడుతుండి, మెసేజ్‌ల విషయంలో సమస్య ఎదుర్కొంటుంటే ఇలా చేయండి. అయితే ఆండ్రాయిడ్‌ మెసేజెస్‌ వాడుతున్న వారికే ఈ సమస్య ఉంది.

మెసేజ్‌లు పంపే/అందుకునే విషయంలో సమస్యలు వస్తున్నాయంటూ చాలామంది సోషల్‌ మీడియాలో ఫిర్యాదులు చేస్తున్నారు. దీనిపై మొబైల్‌ సంస్థలు ఇంకా స్పందించనప్పటికీ... గూగుల్‌ క్యారియర్‌ సర్వీసు యాప్‌తోనే ఇబ్బంది అని టెక్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల గూగుల్‌ క్యారియర్‌ సర్వీసు యాప్‌కు ప్లే స్టోర్‌ గూగుల్‌ కొత్త వెర్షన్‌ (V50)ను తీసుకొచ్చింది. దీనిని అన్‌ఇస్టాల్‌ చేసుకుంటే మెసేజ్‌ల సమస్య తీరుతోందని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు. దీని కోసం ప్లేస్టోర్‌లోని లెఫ్ట్‌ మెనూలో ఉన్న మై యాప్స్‌లోకి వెళ్లండి. అందులో క్యారియర్‌ సర్వీసు యాప్‌ను వెతికి... అన్‌ఇన్‌స్టాల్‌ చేసేయండి. ఆ తర్వాత మొబైల్‌ను రీస్టార్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఈలోపు గూగుల్‌ క్యారియర్‌ సర్వీసుకు కొత్త అప్‌డేట్‌ రిలీజ్‌ చేస్తుంది. దాన్ని ఇన్‌స్టాల్‌ చేసుకుంటే సమస్య ఫిక్స్‌ అవ్వొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న