Clubhouse: లైవ్ ఆడియో అనుభూతి కోసం క్లబ్‌హౌస్‌ కొత్త ఫీచర్
close

Published : 30/08/2021 23:58 IST
Clubhouse: లైవ్ ఆడియో అనుభూతి కోసం క్లబ్‌హౌస్‌ కొత్త ఫీచర్

ఇంటర్నెట్‌డెస్క్‌: విడుదలైన కొద్ది రోజుల్లోనే ఎంతో పాపులర్‌ అయిన ఆడియో సోషల్‌ మీడియా యాప్ క్లబ్‌హౌస్‌ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌తో యూజర్స్‌ని ఆకట్టుకుంటోంది. తాజాగా మరో కొత్త ఫీచర్‌ని యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొచ్చింది. స్పేషియల్ ఆడియో పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్‌తో శ్రోతలు మరింత మెరుగైన ఆడియో అనుభూతిని పొందుతారని క్లబ్‌హౌస్ తెలిపింది. స్పేషియల్‌ ఆడియో కంపెనీతో కలిసి క్లబ్‌హౌస్‌ ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఐఓఎస్ యూజర్స్‌కి ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్స్‌కి పరిచయం చేయనున్నట్లు వెల్లడించింది. 

‘‘క్లబ్‌హౌస్‌లో ఏదైనా చర్చ లేదా సమావేశంలో పాల్గొంటున్నప్పుడు మీకు లైవ్ అనుభూతిని అందించేందుకు వీలుగా మీతోపాటు సమావేశంలో పాల్గొంటున్న వారి మాటలు మీకు 3డీలో వినిపిస్తాయి. దానివల్ల చర్చలో మాట్లాడుతున్న వారిని సులువుగా అనుసరించవచ్చు. స్పేషియల్ ఆడియో ఫీచర్‌ వైర్‌, వైర్‌లెస్‌ హెడ్‌ఫోన్స్‌లో ఎంతో బాగా పనిచేస్తుంది’’ అని క్లబ్‌హౌస్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

కొద్దిరోజుల క్రితం క్లబ్‌హౌస్‌ యాప్‌లో కీలక మార్పులు చేసింది. ఇందులో భాగంగా ఇన్విటేషన్ ఫీచర్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. గతంలో క్లబ్‌హౌస్‌ ఉపయోగించాలనుకునే వారు రిజిస్టర్ అయ్యాక..వాళ్లకి వచ్చిన ఇన్వైట్ రిక్వెస్ట్‌ని అప్పటికే క్లబ్‌హౌస్‌లో ఉన్నవారు నామినేట్ చేస్తేనే ఖాతా యాక్టివేట్ అవుతుంది. దీనిపై యూజర్స్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆ ఫీచర్‌ను తొలగించింది. అలానే బ్యాక్‌ ఛానల్ పేరుతో డైరెక్ట్‌ మెసేజింగ్ ఫీచర్‌ని కూడా పరిచయం చేసింది. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న