Clubhouse: ఆండ్రాయిడ్‌ కోసం వచ్చేస్తోంది!
close

Updated : 19/05/2021 18:27 IST
Clubhouse: ఆండ్రాయిడ్‌ కోసం వచ్చేస్తోంది!

ఇంటర్నెడ్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమాల వరుస మారుతోంది. అక్షరాలు, వీడియోల ద్వారా  భావాలను పంచుకోవడానికి మొదటిలో ఫేస్‌బుక్‌, తర్వాత ట్విట్టర్‌ వచ్చాయి. ఇప్పడు ఆడియోల రూపంలో కూడా మన భావాలను పంచుకోవచ్చు. అందుకు ఉపకరించే ఆడియో ఓన్లీ సోషల్‌ ఫ్లాట్‌పాం ‘క్లబ్‌హౌస్‌’. అమెరికాకు చెందిన ఆల్ఫా ఎక్స్‌ప్లోరేషన్‌ కో సంస్థ రూపొందించింది. ఈ యాప్‌ యాపిల్‌ ఐఓఎస్‌ యూజర్ల కోసం మార్చి 2020లో విడుదలచేశారు. విడుదలైన ఒక సంవత్సర కాలంలోనే బాగా ప్రాచుర్యం పొందింది. దీన్ని గతవారం అమెరికాలో ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చారు. కాగా మనదేశంలో కూడా ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం క్లబ్‌ హౌస్‌ యాప్ విడుదలకు సన్నాహకాలు చేస్తున్నారు. రష్యా, జపాన్‌, బ్రెజిల్‌లో మంగళవారం నుంచి ఆండ్రాయిడ్‌లో ఈ యాప్‌ పనిచేయనుండగా మన దేశంలో మార్చి 21నుంచి ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులో తీసుకొస్తామని క్లబ్‌హౌస్‌ సంస్థ తెలిపింది.  గూగుల్‌ ప్లేస్టోర్‌లో ఈ యాప్‌కు సంబంధించి ప్రీ రిజిస్ట్రేషన్స్‌ మొదలయ్యాయి. కాగా 5 వేల మందితో చాట్‌ రూమ్‌ ఏర్పాటు చేసుకుని మాట్లాడుకునే ప్రత్యేకమైన ఫీచర్‌ క్లబ్‌ హౌస్‌లో ఉంది. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న