Clubhouse: యూజర్‌ డేటా లీక్..క్లబ్‌హౌస్‌ వివరణ
close

Published : 26/07/2021 23:06 IST
Clubhouse: యూజర్‌ డేటా లీక్..క్లబ్‌హౌస్‌ వివరణ

ఇంటర్నెట్‌డెస్క్‌: కొద్ది రోజుల క్రితం యూజర్‌ లాగిన్‌లో ఇన్‌వైట్‌ ఫీచర్‌ తొలగిస్తున్నట్లు ఆడియో సోషల్‌మీడియా యాప్‌ క్లబ్‌హౌస్ ప్రకటించింది. దీంతో కొత్తగా ఈ యాప్‌ను కొత్తగా ఉపయోగించాలకునే వారికి లాగిన్ సమస్య ఉండదని క్లబ్‌హౌస్‌ భావించింది. తాజాగా ఈ యాప్‌లోని ఖాతాదారుల ఫోన్ నంబర్లను హ్యాకర్స్ డార్క్‌ వెబ్‌లో అమ్మకానికి పెట్టినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలను క్లబ్‌హౌస్ కొట్టిపారేసింది. తమ యాప్‌పై ఎలాంటి సైబర్ దాడి జరగలేదని, ఖాతాదారులకు సంబంధించి ఎలాంటి సమాచారం లీక్ అవ్వలేదని తెలిపింది. ‘‘సాఫ్ట్‌వేర్ ప్రోగ్రాంలు రోజులో ఎన్నో రకాల ఫోన్‌ నంబర్లను పరిశీలిస్తుంటాయి. వాటిలో కొన్ని అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్‌లో (ఏపీఐ)ని గణాంకాల కారణంగా డేటాలో కనిపిస్తుంటాయి. అవి క్లబ్‌హౌస్‌ ఖాతాదారుల నంబర్లు కావు.  వినియోగదారుల డేటాను క్లబ్‌హౌస్‌ ఎప్పటికీ దుర్వినియోగం చేయదు. యూజర్ ప్రైవసీనే మాకు ముఖ్యం’’ అని క్లబ్‌హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ వాదన సరికాదని సైబర్‌ నిపుణులు అంటున్నారు. హ్యాకర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 3 కోట్ల మంది క్లబ్‌హౌస్ ఖాతాదారుల నంబర్లను డార్క్‌వెబ్‌లో ఉంచారని, వాటికి సంబంధించిన స్క్రీన్‌ షాట్లను తమ ట్విరట్ ఖాతాలో షేర్ చేశారు. దీనిపై రాజశేఖర్ రాజహరియా అనే సైబర్‌ నిపుణుడు మాట్లాడుతూ ‘‘క్లబ్‌హౌస్‌ ఖాతాదారులవిగా పేర్కొంటున్న డేటాలో పేర్లు, ఫొటోలు లేవు. ఫోన్‌ నంబర్ల జాబితాను సంపాదించడం చాలా సులువు. క్లబ్‌హౌస్‌ యూజర్స్‌ డేటా లీకైందనే ఆరోపణలు అవాస్వతం కావచ్చు’’ అని అన్నారు. ఈ ఏడాది ఫ్రిబ్రవరిలో అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీకి చెందిన సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు క్లబ్‌హౌస్‌ను హెచ్చరించారు. యాప్‌లో యూజర్స్ ఆడియో డేటా చైనా ప్రభుత్వానికి చేరుతోంని , దీని వెనక క్లబ్‌హౌస్‌కి బ్యాక్-ఎండ్‌ సాంకేతికతకు సంబంధించిన సమాచారం అందిస్తున్న చైనా సంస్థ హస్తం ఉందని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో తాజా డేటా లీక్ ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న