Clubhouse Wave: క్లబ్‌హౌస్‌లో వేవ్‌ ఫీచర్‌.. ఒక్క క్లిక్‌తో ఛాట్ షురూ! 
close

Published : 19/09/2021 20:00 IST
Clubhouse Wave: క్లబ్‌హౌస్‌లో వేవ్‌ ఫీచర్‌.. ఒక్క క్లిక్‌తో ఛాట్ షురూ! 

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆడియో మెసేజింగ్ యాప్‌ క్లబ్‌హౌస్‌ విభిన్న ఫీచర్స్‌తో యూజర్స్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఇన్వైట్ ఫీచర్‌ని తొలగించడంతోపాటు లైవ్‌ ఆడియో అనుభూతి కోసం స్పేషియల్ ఆడియో ఫీచర్‌ను పరిచయం చేసింది. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. దీంతో యూజర్స్ తమ స్నేహితులను ఛాట్‌ రూంకి ఆహ్వానించొచ్చు. ఇందుకోసం క్లబ్‌హౌస్‌లో వేవ్‌ సింబల్‌ను యాడ్ చేయనుంది. మెసేంజర్‌లోలానే క్లబ్‌హౌస్‌లో మీరు ఎవరితో చాట్ చేయాలనుకుంటున్నారో వారి ప్రొఫైల్ ఓపెన్ చేసి వేవ్‌ సింబల్‌పై క్లిక్ చేస్తే మీరు వారితో చాట్‌ చేయాలనుకుంటున్నట్లు అవతలి వారికి తెలుస్తుంది. ఒకవేళ అవతలి వ్యక్తి స్పందిస్తే యాప్‌లో ప్రత్యేక రూమ్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు వారితో సంభాషింవచ్చు. 

ప్రస్తుతం ఈ ఫీచర్ పరీక్షల దశలో ఉందని, త్వరలోనే దీన్ని యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురానున్నట్లు జేన్ వాంగ్ అనే టిప్‌స్టర్‌ తెలిపారు. అలానే కొద్దిరోజుల క్రితం క్లబ్‌హౌస్ బ్యాక్‌ఛానల్ పేరుతో డైరెక్ట్ మెసేజింగ్ ఫీచర్‌ను పరిచయం చేసింది. దీంతో యాప్‌లో వన్‌-టు-వన్‌, గ్రూప్‌ చాట్‌లు సులభంగా చేసుకోవచ్చు. ఆడియో రూమ్‌ మధ్యలో లేదా ముగిసిన తర్వాత ఒకరితో ఒకరు చాట్‌ చేసేందుకు ఇతర యాప్‌లపై ఆధారపడకుండా క్లబ్‌హౌస్‌లో సంభాషించుకునేందుకు వీలుగా బ్యాక్‌ఛానల్‌ను డిజైన్‌ చేసినట్లు వెల్లడించింది. క్లబ్‌హౌస్‌కి పోటీగా వచ్చిన ట్విటర్ స్పేసెస్‌, ఫేస్‌బుక్ లైవ్‌ ఆడియోలో డైరెక్ట్ మెసేజ్ ఫీచర్ ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో ఆడియో ద్వారా చర్చ జరుగుతున్నప్పుడే చాట్ చేసుకోవచ్చు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న