close

Published : 15/02/2021 22:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వాట్సాప్‌, ఇన్‌స్టా మెసేజింగ్‌తో ఫేస్‌బుక్ స్మార్ట్‌వాచ్  

ఇంటర్నెట్ డెస్క్‌: కొవిడ్‌-19 ప్రభావంతో ప్రతి ఒక్కరిలో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పెరిగాయి. దీంతో ఎప్పటికప్పుడు శరీర పరిస్ధితులను అంచనా వేసి, యూజర్‌ని అలర్ట్‌గా ఉంచే స్మార్ట్‌వాచ్‌లకు డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో సరికొత్త ఫీచర్స్‌తో వివిధ రకాల ఫిట్‌నెస్‌ బ్యాండ్‌లు, స్మార్ట్‌వాచ్‌లు అందుబాటు ధరల్లో మార్కెట్లో సందడి చేస్తున్నాయి. తాజాగా సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్ కూడా సరికొత్త ఫీచర్స్‌తో స్మార్ట్‌వాచ్‌ తీసుకొస్తోందట. మెసేజింగ్‌ ఫీచర్‌తోపాటు ఆరోగ్యపరమైన అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీన్ని తయారుచేస్తున్నారు. ఈ వాచ్‌ సాయంతో ఫేస్‌బుక్‌కు చెందిన మెసేంజర్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రాం నుంచి మెసేజ్‌లు పంపొచ్చని సమాచారం. ఫేస్‌బుక్‌ వర్చువల్ రియాల్టీ హెడ్‌సెట్‌లు, పోర్టల్ వీడియో ఛాట్ డివైజ్‌లు, ఇతర హార్డ్‌వేర్ ఈకోసిస్టంల తరహాలోనే ఇది కూడా యూజర్‌కి మెరుగైన పనితీరును అందిస్తుందని టెక్‌ వర్గాల అంచనా. 

దీనితో పాటు ఫేస్‌బుక్ సొంతగా ఆపరేటింగ్ సిస్టం (ఓఎస్‌)ను అభివృద్ధి చేస్తుందని తెలుస్తోంది. ఈ కొత్త ఓఎస్‌ను భవిష్యత్తులో రాబోయే వేరబుల్స్‌ (ఒంటిపై ధరించే స్మార్ట్‌ గ్యాడ్జెట్స్‌)లో ఉపయోగించాలని భావిస్తోంది. ఈ ఏడాది చివర్లో కానీ, వచ్చే ఏడాది ప్రథమార్ధానికి స్మార్ట్‌వాచ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఫేస్‌బుక్ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇప్పటికే రే-బాన్‌ కంపెనీతో కలిసి ఫేస్‌బుక్‌ స్మార్ట్‌‌గ్లాసెస్‌ను తయారుచేస్తున్న సంగతి తెలిసిందే.  

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న

రుచులు