FBలో కొత్త ఫీచర్స్‌..లైక్‌ బటన్ ఉండదు‌..!
close

Published : 15/01/2021 11:02 IST
FBలో కొత్త ఫీచర్స్‌..లైక్‌ బటన్ ఉండదు‌..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్ యూజర్లకి సరికొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమయ్యింది. ఈ మేరకు ఫేస్‌బుక్‌ పేజ్‌ లేవుట్‌లో కీలక మార్పులు చేయనుంది. దానితో పాటు పలు కొత్త ఫీచర్లని పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది. గతేడాదే ఈ ఫీచర్స్‌ని ఫేస్‌బుక్‌లో పాపులర్‌ అయిన వ్యక్తులు, నటీనటులు, రచయితలు, క్రియేటర్స్‌తో పాటు పలు వాణిజ్య పేజీల ద్వారా పరీక్షించారు. త్వరలో ఈ మార్పులు యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురానున్నారు. మరి అవేంటో ఒక్కసారి చూద్దాం..

ఇంటర్‌ఫేస్‌ రీడిజైన్‌

ఫేస్‌బుక్‌లో పర్సనల్‌ ప్రొఫైల్‌, పబ్లిక్‌ పేజ్‌కి మధ్య అనుసంధానం మరింత సులభంగా ఉండేలా మార్పులు చేయనున్నట్లు ఫేస్‌బుక్‌ తెలిపింది. ఇందుకోసం ప్రొఫైల్‌, పబ్లిక్‌ పేజ్‌ ఇంటర్‌ ఫేస్‌ను రీడిజైన్‌ చేస్తున్నారు. దాని వల్ల యూజర్స్‌ ప్రొఫైల్‌, పేజ్‌ పోస్టులను సులభంగా మారొచ్చు.

పేజ్‌లకు మరిన్ని హంగులు

ఇక మీదట ఫేస్‌బుక్‌ పేజ్‌ నడిపేవాళ్లు ఫాలోవర్స్‌తో సంభాషిస్తూ వారి మధ్య జరిగే చర్చలో పాల్గొనొచ్చు. అంతేకాకుండా పేజ్‌లో పోస్టుల గురించి సెలబ్రిటీలు, వెరిఫైడ్‌ అకౌంట్ కలిగిన వ్యక్తులు, గ్రూపులు, ఇతర వెరిఫైడ్‌ పేజ్‌లు కామెంట్‌ చేస్తే..వాళ్లని కామెంట్ సెక్షన్‌ నుంచి ఫాలో అయ్యేలా అక్కడ ఫాలో ఆప్షన్‌ చూపిస్తుంది. అలాగే పేజ్‌లో జరిగే సంభాషణలు ఎక్కువ మందికి తెలిసేలా ఉండేందుకు సెలబ్రిటీలు, వెరిఫైడ్‌ అకౌంట్ కలిగిన వ్యక్తులు, గ్రూపులు, ఇతర వెరిఫైడ్‌ పేజ్‌ల నుంచి వచ్చిన కామెంట్స్‌ మొదట కనిపిస్తాయి. దాంతో వారిని సులభంగా గుర్తించి రిప్లై ఇవ్వొచ్చు, ఫాలో కావొచ్చు.

లైక్‌ బటన్‌ కనిపించదు

ఫేస్‌బుక్‌లో మనకు ఏదైనా పేజ్‌ నచ్చితే దాన్ని లైక్‌ కొట్టి ఫాలో అవుతాం. ఇక మీదట ఇలా చేయడం కుదరదు. ఎందుకంటే  పేజ్‌ లైక్‌ బటన్‌ను తొలగిస్తున్నారు. దానికి బదులు ఫాలో బటన్‌ ద్వారానే పేజ్‌కు సంబంధిన అప్‌డేట్స్‌ను పొందొచ్చు. ఫాలోవర్స్‌ ఆధారంగానే ఆ పేజ్‌ నడిపేవాళ్లకు ఫేస్‌బుక్‌లో ఎంత మంది అభిమానులున్నారు..పేజ్‌ ఎంత పాపులర్ అనేది నిర్ధారిస్తారు. ఉదాహరణకు కొంతమంది ముందుగా పేజ్‌ను లైక్‌, ఫాలో చేసి తర్వాత ఆసక్తి లేక అన్‌ఫాలో చేస్తారు. కానీ డిస్‌లైక్‌ చెయ్యరు. దాంతో పేజ్‌ పాపులారిటీని నిర్ధారించేప్పుడు లైక్స్‌, ఫాలోవర్స్‌ మధ్య వ్యత్యాసం ఉంటుంది. ఈ తరహా పద్ధతికి చెక్‌ పెట్టేందుకు పేజ్‌ లైక్‌ బటన్‌ని తీసేస్తున్నట్లు ఫేస్‌బుక్‌ తెలిపింది. 

పేజ్‌ మేనేజ్‌మెంట్ 

ఇక పేజ్‌ మేనేజ్‌మెంట్‌ యాక్సెస్‌లో కూడా కొత్త ఫీచర్స్ తీసుకొస్తున్నారు. పేజ్‌లో ఇన్‌సైట్స్‌, యాడ్స్‌, కంటెట్‌, కమ్యూనిటీ యాక్టివిటీ, మెస్సేజెస్‌ వంటి వాటికి సంబంధించిన పనులను చక్కబెట్టేందుకు అడ్మిన్‌ యాక్సెస్‌ ఇచ్చేలా మార్పులు చేస్తున్నారు. దీని వల్ల పేజ్‌ భద్రత, నైతికతకు భంగం వాటిల్లదని ఫేస్‌బుక్‌ భావిస్తోంది. గతంలో ఇలాంటి వాటి కోసం పూర్తిగా పేజ్‌ అడ్మిన్ యాక్సెస్‌ ఇచ్చేవారు. ఫేస్‌బుక్‌కు వచ్చిన సూచనలు, సలహాలు ఆధారంగా ఈ ఫీచర్‌ను పరిచయం చేస్తున్నారు. వీటితో పేజ్‌లకు కొత్త అడ్మిన్‌లను యాడ్ చేయడం, ఇన్‌సైట్స్‌ అనుమతులు ఇవ్వడం మరింత సులభం అవుతుంది.

 వెరిఫైడ్ బ్యాడ్జ్‌కి కొత్త హంగులు

నకిలీ వార్తలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, విద్వేషపూరిత ప్రసంగాలు, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసే వారిపట్ల ఫేస్‌బుక్‌ మరింత కఠినంగా వ్యవహరించనుంది. ఇందుకోసం వెరిఫైడ్ పేజ్‌లకు ఇచ్చే బ్లూ కలర్‌ వెరిఫైడ్ బ్యాడ్జ్‌ బాగా కనిపించేలా మార్పులు చేయనున్నారు. దాని వల్ల వైరిఫైడ్ ఖాతాల నుంచి వచ్చే అభ్యంతరకర పోస్టులు, కామెంట్లను వ్యాపించకుండా అడ్డుకోవచ్చని ఫేస్‌బుక్‌ అభిప్రాయపడుతోంది. ఇవే కాకుండా ప్రశ్న, జవాబు తరహా ఫీచర్‌ని కూడా తీసుకొస్తున్నారు. దీని ద్వారా పేజ్‌ క్రియేటర్స్..‌ ఫాలోవర్స్‌ నుంచి నేరుగా ప్రశ్నలు స్వీకరించవచ్చు. వాణిజ్య అవసరాల కోసం పేజ్‌ నడిపే వ్యక్తుల లేదా కంపెనీలకు ఈ ఫీచర్‌ ఎంతో ఉపయోగపడుతుందని ఫేస్‌బుక్‌ పేర్కొంది.

ఇవీ చదవండి..

2021లో ఆన్‌లైన్ భద్రత.. ఏం చేయాలంటే..!

ఫేక్‌న్యూస్‌ కట్టడికి ఫేస్‌బుక్ ఏం చేసిందంటే..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న