ఫౌజీ వచ్చేస్తున్నాడు..ఎప్పుడంటే..?
close

Updated : 03/01/2021 22:24 IST

ఫౌజీ వచ్చేస్తున్నాడు..ఎప్పుడంటే..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: గేమర్స్‌కి గుడ్‌న్యూస్‌. పబ్‌జీకి ప్రత్యామ్నాయంగా పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ఫౌజీ (ఫియర్‌లెస్‌ అండ్‌ యునైటెడ్‌ గార్డ్స్‌) గేమ్‌ విడుదలకు ముహూర్తం ఖరారైంది. గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 26న ఫౌజీ గేమ్‌ను విడుదల చేస్తున్నట్లు ఎన్‌కోర్ గేమ్స్‌ సంస్థ తెలిపింది. ఈ మేరకు ట్విటర్ వేదికగా గేమ్‌ విడుదలపై ప్రకటన చేసింది. ఇదే విషయాన్ని గేమ్‌కి మెంటార్‌గా వ్యవహరిస్తున్న బాలీవుడ్ నటుడు అక్షయ్‌ కుమార్‌ కూడా ట్విటర్‌లో వెల్లడించారు. ఈ సందర్భంగా భారత జవాన్లు గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో తలపడుతున్న దృశ్యాలతో కూడిన కొత్త టీజర్‌ గేమ్‌పై మరింత ఆసక్తి పెంచేలా ఉంది.

భారత్‌లో పబ్‌జీపై నిషేధం తర్వాత ఫౌజీ గేమ్‌ను తీసుకొస్తున్నట్లు గతేడాది జులైలో ప్రకటించారు. ఆ తర్వాత విజయదశమి సందర్భంగా తొలి టీజర్‌ను విడుదల చేశారు. 2020 డిసెంబరు నెలలో గేమ్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభించగా 24 గంటల్లో ఒక మిలియన్‌ రిజిస్ట్రేషన్లతో రికార్డు సృష్టించింది. తాజాగా రిపబ్లిక్‌ డే సందర్భంగా గేమ్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ గేమ్‌ కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా దేశ సైనికుల త్యాగాలను తెలియజెప్పేలా ఉంటుందని గతంలో అక్షయ్‌ కుమార్‌ తెలిపారు. ఫౌజీని బెంగళూరుకి చెందిన స్టూడియో ఎన్‌కోర్ గేమ్స్‌ అనే సంస్థ రూపొందించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న