పిక్సల్‌ మడతెడుతోంది.. కొత్తగా ‘వీ60 థింక్‌క్యూ 5జీ యూడబ్ల్యు’ 
close

Updated : 03/03/2021 15:23 IST
పిక్సల్‌ మడతెడుతోంది.. కొత్తగా ‘వీ60 థింక్‌క్యూ 5జీ యూడబ్ల్యు’ 

మార్కెట్‌లో పిక్సల్‌ ఫోన్‌లకు ఉన్న ప్రత్యేకత వేరు. గూగుల్‌ బ్రాండ్‌ ఇమేజ్‌తో అలరిస్తూ వస్తున్న పిక్సల్‌.. మడత ఫోన్‌గా పరిచయం అయ్యేందుకు సిద్ధం అవుతోంది. ఈ ఏడాది చివరికల్లా మార్కెట్‌లోకి రానుంది. ఫోన్‌ తెర పరిమాణం 7.6 అంగుళాలు ఉండొచ్చని అంచనా. ఇతర టెక్నాలజీ స్పెసిఫికేషన్స్‌పై ఇంకా ఎలాంటి సమాచారం లేదు.


ఆండ్రాయిడ్‌ 11 ఓఎస్‌తో..

ఎల్‌జీ కొత్త ఓఎస్‌ అప్‌డేట్‌తో ‘వీ60 థింక్‌క్యూ 5జీ యూడబ్ల్యు’ పరిచయం చేసింది. బబుల్‌ ఛాట్, కొత్త ఐకాన్లు, నియర్‌బై షేర్, ఫోకస్‌ మోడ్, బెడ్‌టైమ్‌ మోడ్‌.. లాంటి ఇతర ఫీచర్లను 11 అప్‌డేట్‌లో పొందొచ్చు. ఫోన్‌ తెర పరిమాణం 6.8 అంగుళాలు. రిజల్యూషన్‌ 1080X2460 పిక్సల్స్‌. డిస్‌ప్లేలోనే ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ ఉంది. వెనక మూడు కెమెరాలు (64ఎంపీ, 13ఎంపీ, 0.3ఎంపీ) ఉన్నాయి. సెల్ఫీ కెమెరా సామర్థ్యం 10ఎంపీ. స్నాప్‌డ్రాగన్‌ 865 ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 8జీబీ. స్టోరేజ్‌ సామర్థ్యం 128 జీబీ. బ్యాటరీ సామర్థ్యం 5,000ఎంఏహెచ్‌. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న