
ఒక పక్క ఎంఐ11 అల్ట్రా, ఎంఐ 11లైట్ స్మార్ట్ ఫోన్ల సందడి కొనసాగుతుండగానే.. షామీ కొత్త రకం ఫిట్నెస్ బ్యాండ్లతో ముందుకొచ్చింది. ‘ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 6’తో కొత్త సిరీస్ ఫిట్నెస్ బ్యాండ్లను ప్రపంచ మార్కెట్లోకి తెచ్చింది. తెర పరిమాణం పెంచుకుని, 30 రకాల స్పోర్ట్ మోడ్‌లను పరిచయం చేస్తోంది. తెర పరిమాణం 1.56 అంగుళాలు. డయల్ పొడవు పెంచుకుని మరింత ఆకట్టుకునేలా ముస్తాబయ్యింది. తిలీవీలినిదీ డిస్ప్లే. రిజల్యూషన్ 152్ల360 పిక్సల్. సుమారు 130 రకాల ‘వాచ్ ఫేసెస్’ని ఎంపిక చేసుకోవచ్చు. ఇక సెన్సర్ల విషయానికొస్తే.. హార్ట్‌రేట్ సెన్సర్ ఉంది. ‘ఎస్పీఓ2’ సెన్సర్‌తో 24 గంటల పాటు హార్ట్‌రేట్‌ని ట్రాక్ చేయడంతో పాటు.. రక్తంలో ఆక్సిజన్ హెచ్చుతగ్గుల్ని చెబుతుంది. కరోనా పొంచి ఉన్న తరుణంలో ఈ ప్రత్యేక సెన్సర్‌తో నిత్యం ఆరోగ్యంపై నిఘా పెట్టొచ్చు. ‘స్లీప్ మానిటరింగ్’ ద్వారా నిద్రని ట్రాక్ చేస్తుంది. 30 రకాల ‘స్పోర్ట్ మోడ్’లను బ్యాండ్ 6లో పొందొచ్చు. వాలీబాల్, టేబుల్ టెన్నిస్, బాక్సింగ్, క్రికెట్, బౌలింగ్, బాస్కెట్‌బాల్, స్ట్రీట్ డ్యాన్స్.. ఇలా వ్యాయామం నిమిత్తం ఏది చేస్తున్నా, సంబంధిత మోడ్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ‘ఎన్ఎఫ్సీ’ సపోర్టు కూడా ఉంది. వాయిస్ అసిస్టెంట్ ‘అలెక్సా’ని వాడుకోవచ్చు. బ్యాండ్‌ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 14 రోజులు పని చేస్తుంది.
* అంచనా ధర రూ.3,100