మేటి ఫీచర్ల ఐక్యూ 007
close

Published : 05/05/2021 00:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
మేటి ఫీచర్ల ఐక్యూ 007

ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న వివో ఐక్యూ 007 సిరీస్‌ అమ్మకాలు ఆన్‌లైన్‌ అంగళ్లలో మొదలయ్యాయి. ఫీచర్లు అదరహో అంటున్నారు టెక్నాలజీ నిపుణులు. ఐక్యూ 007 5జీ, ఐక్యూ 007 లెజెండ్‌ అనే రెండు వేరియంట్లలో లభిస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, ధరలు సంక్షిప్తంగా.
బ్యాటరీ: లై-పో 4000 ఎంఏహెచ్‌, నాన్‌ రిమూవబుల్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ 120వాట్స్‌ బ్యాటరీతో పని చేస్తుంది.
సామర్థ్యం: క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 870 5జీ ప్రాసెసర్‌ శక్తి దీని సొంతం. 12జీబీ ర్యామ్‌, 256 జీబీ యూఎఫ్‌ఎస్‌ 3.1 2 స్టోరేజీ దీని సొంతం.
డిస్‌ప్లే: 6.62అంగుళాల ఎఫ్‌.హెచ్‌.డి.రిజల్యూషన్‌, అమోల్డ్‌ డిస్‌ప్లేతో పని చేస్తుంది. స్మార్ట్‌ఫోన్లలో మొదటిసారి ఇంటలిజెన్స్‌ డిస్‌ప్లే చిప్‌తో వచ్చిన ఫోన్‌ ఇదే అంటోంది వివో.
కెమెరా: వెనక ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ ఉంది. 48మెగా పిక్సల్‌ కెమెరా సోనీ ఐఎంఎక్స్‌ 598సెన్సర్‌, ఓఐఎస్‌ ఫీచర్‌తో పని చేస్తాయి. జతగా 13 మెగా పిక్సళ్ల అల్ట్రావైడ్‌ మ్యాక్రో కెమెరా ఉంది. అదనంగా 16 మెగా పిక్సల్‌ సెల్ఫీ కెమెరా అమర్చారు.
ధర: రూ 31,990 (8జీబీ+128జీబీ), రూ.33,990 (8జీబీ+256జీబీ), రూ.35,999 (12జీబీ+256జీబీ).


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న

రుచులు