అలెక్సా.. టీకా ఎక్కడ?
close

Published : 12/05/2021 00:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అలెక్సా.. టీకా ఎక్కడ?

గ్గర్లోని టీకా కేంద్రాల గురించి ఆరా తీస్తున్నారా? అయితే అలెక్సాకు ఆ పని అప్పజెబితే? అమెరికాలో ఇప్పటికే ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. సమీపంలోని టీకా కేంద్రాల సమాచారాన్ని సంగ్రహించే సామర్థ్యాన్ని అలెక్సాకు నేర్పించారు మరి. ఇందుకోసం అలెక్సాకు ఒక కొత్త ఫీచర్‌ను జోడించారు. ‘అలెక్సా, కొవిడ్‌ టీకా ఎక్కడ అందుబాటులో ఉంది?’ అని అడిగితే చాలు. సమీపంలోని టీకా కేంద్రాల జాబితా సిద్ధమైపోతుంది. ఆన్‌లైన్‌ పోర్టళ్లు, సైట్ల ద్వారా అపాయింట్‌మెంట్‌ పొందటానికి ఇబ్బందులు ఎదుర్కొనేవారికి.. ముఖ్యంగా వృద్ధులకు ఇది ఎంతగానో ఉపయోగపడగలదని భావిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న