వీఆర్‌ జ్ఞాపకం
close

Updated : 02/06/2021 04:34 IST
వీఆర్‌ జ్ఞాపకం

ఆటలతో జ్ఞాపకశక్తిని పెంచుకోగలిగితే? వృద్ధాప్యంలో మతిమరుపును నివారించుకోగలిగితే?వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌) పరిజ్ఞానంతో ఇది సాధ్యమేనంటున్నారు శాస్త్రవేత్తలు. ఆయా విషయాలను, సంఘటనలను గుర్తుకు తెచ్చుకోవటానికిది తోడ్పడగలదని చెబుతున్నారు. వీఆర్‌ గేమ్‌ మూలంగా వృద్ధుల్లో జ్ఞాపకశక్తి మెరుగుపడుతున్నట్టు తేలటమే దీనికి నిదర్శనం. వీఆర్‌ హెడ్‌సెట్‌ను తలకు ధరించి లాబరింత్‌ అనే ఆటను ఆడాలని శాస్త్రవేత్తలు  కొందరు వృద్ధులకు సూచించారు. కాల్పనిక వాస్తవ దృశ్యాలు, వాతావరణంలో చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లటం, ఇచ్చిన లక్ష్యాలను పూర్తిచేయటం ఇందులో భాగం. మిగతా వాళ్లతో పోలిస్తే వీఆర్‌ హెడ్‌సెట్‌తో ఆటాడిన వారు జ్ఞాపకశక్తి పరీక్షల్లో మరింత మెరుగ్గా రాణించటం, అదీ చిన్నవయసు వారితో సమానంగా మార్కులు తెచ్చుకోవటం విశేషం. దీర్ఘకాల జ్ఞాపకశక్తికి కీలకమైన మెదడులోని హిప్పోక్యాంపస్‌ అనే భాగం ప్రేరేపితమయ్యేలా వీఆర్‌ ఆటను రూపొందించటమే దీనికి కారణమని భావిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న