ఆండ్రాయిడ్‌లోనూ ఆఫీస్‌ డార్క్‌
close

Updated : 02/06/2021 04:35 IST
ఆండ్రాయిడ్‌లోనూ ఆఫీస్‌ డార్క్‌

ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ యాప్‌ను వినియోగిస్తున్నారా? మీకో శుభవార్త. త్వరలో దీన్ని డార్క్‌మోడ్‌లోనూ వాడుకోవచ్చు. ఇప్పటివరకూ ఐఓఎస్‌కే పరిమితమైన దీన్ని మైక్రోసాఫ్ట్‌ సంస్థ ఇప్పుడు ఆండ్రాయిడ్‌ ఫోన్లకూ విస్తరించనుంది. దీంతో ఈ ఫీచర్‌ కోసం ఎదురుచూస్తున్న ఎంతోమంది కోరిక తీరనుంది. చదువుకోవటానికి, మొబైల్‌ పరికరాలపై పనిచేయటానికి డార్క్‌ మోడ్‌ చాలా సౌకర్యంగా ఉంటుంది. సిస్టమ్‌ ప్రిఫరెన్స్‌లో సెట్‌ చేసుకుంటే తాజా ఆఫీస్‌ యాప్‌ తనకుతానే డార్క్‌ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. కావాలనుకుంటే యాప్‌ హోమ్‌ ట్యాబ్‌ నుంచీ డార్క్‌ మోడ్‌ను ఎంచుకోవచ్చు. ఇది అందుబాటులోకి రావడానికి మరికొద్ది వారాలు పట్టనుంది. అందువల్ల అన్ని ఫోన్లలోనూ వెంటనే ఈ ఫీచర్‌ కనిపించకపోవచ్చు. ఒక్క ఆఫీస్‌ యాప్‌లోనే వర్డ్‌, ఎక్సెల్‌, పవర్‌ పాయింట్‌ అన్నీ ఉంటాయి. పీడీఎఫ్‌ స్కానింగ్‌ సదుపాయమూ ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న