కుకీస్‌ వాటంతటవే పోవాలంటే?
close

Published : 09/06/2021 00:31 IST
కుకీస్‌ వాటంతటవే పోవాలంటే?

రోజూ ఎన్నో సైట్లు చూస్తుంటాం. ఎన్నెన్నో కుకీస్‌ వచ్చి చేరుతుంటాయి. వీటిని డిలిట్‌ చేసుకునే అవకాశమున్నా తరచూ కుకీస్‌ను తొలగించుకునే  వారికిది ఇబ్బందే. ఇవి వాటంతటవే పోతే? డెస్క్‌టాప్‌ క్రోమ్‌, ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్లలో దీనికో చిట్కా ఉంది. దీన్ని పాటిస్తే బ్రౌజర్‌ మూయగానే కుకీస్‌ వాటంతటవే సిస్టమ్‌ నుంచి తొలగిపోతాయి.

క్రోమ్‌లోనైతే..
ముందు క్రోమ్‌ను ఓపెన్‌ చేయాలి. అన్నింటికన్నా పైన కుడిభాగాన నిలువుగా ఉన్న మూడు చుక్కలను క్లిక్‌ చేసి, సెటింగ్స్‌ ఆప్షన్‌ను నొక్కాలి.
సెటింగ్స్‌ పేజీలోకి వెళ్లాక ‘ప్రైవసీ అండ్‌ సెక్యూరిటీ’ విభాగాన్ని ఎంచుకోవాలి.
తర్వాత ‘ప్రైవసీ’ విభాగంలోని ‘కుకీస్‌ అండ్‌ అదర్‌ సైట్‌ డేటా’ను క్లిక్‌ చేయాలి.
ఈ పేజీలో కాస్త కిందికి వెళ్తే ‘క్లియర్‌ కుకీస్‌ అండ్‌ సైట్‌ డేటా వెన్‌ యు క్విట్‌ క్రోమ్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది. దీన్ని ఆన్‌ చేసుకుంటే చాలు.

ఫైర్‌ఫాక్స్‌లోనైతే
బ్రౌజర్‌ను ఓపెన్‌ చేయాలి.
పైన కుడివైపున ఉన్న అడ్డ గీతల ద్వారా ‘ఆప్షన్స్‌’లోకి  వెళ్లాలి.
‘ప్రైవసీ అండ్‌ సెక్యూరిటీ’ పేజీని ఓపెన్‌ చేయాలి.
కుకీస్‌ అండ్‌ సైట్‌ డేటా విభాగంలోని ‘డిలిట్‌ కుకీస్‌ సైట్‌ డేటా వెన్‌ ఫైర్‌ఫాక్స్‌ ఈజ్‌ క్లోజ్డ్‌’ ఆన్‌ చేసుకోవాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న