చిక్కులకు కవర్‌ వేద్దాం
close

Published : 09/06/2021 00:35 IST
చిక్కులకు కవర్‌ వేద్దాం

ఫోన్లు, సాఫ్ట్‌వేర్లే కాదు.. వెబ్‌క్యామ్‌లనూ హ్యాక్‌ చేసేసి మన కదలికల్ని కనిపెట్టే టెక్‌ చోరాగ్రేసరులు పెరిగిపోతున్నారు. డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌లకు కవర్‌ వేస్తే హ్యాకింగ్‌ని అడ్డుకోవచ్చు. చిన్న స్టిక్కర్‌లాంటి  వీటిని వెబ్‌క్యామ్‌లకు అతికించుకుంటే చాలు. పక్కకి స్వైప్‌ చేసి లాక్‌, అన్‌లాక్‌ చేసుకోవచ్చు. అక్రమార్కుల నుంచి రక్షణే కాదు.. వెబ్‌క్యామ్‌ లెన్స్‌ పాడవకుండా కూడా కాపాడుకోవచ్చు.  మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని వెబ్‌కామ్‌ కవర్లు ఇవి.

Cimkiz WB01 and WB02-2 Cover 
ఇవి డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌ఫోన్‌.. అన్నింటికీ పని చేస్తాయి. మందం 0.027 అంగుళాలు మాత్రమే. నలుపు, వెండి రంగుల్లో లభిస్తున్నాయి. ధర రూ.600


Trobing Webcam Cover 
ఇది మ్యాటె ట్రోబింగ్‌ కవర్‌.   స్లైడర్‌ జారిపోకుండా మంచి పట్టుతో ఉంటుంది. మందం 0.03 అంగుళాలు. ధర రూ.400


Cooloo Webcam Cover 
ఈ కవర్‌ 0.027 అంగుళాల మందమే ఉన్నా మంచి దృఢంగా ఉంటుంది అంటోంది తయారీ సంస్థ. లాప్‌టాప్‌, టాబ్లెట్‌.. అన్నింటికీ పని చేస్తుంది.  


Targus Spy Guard
ఎక్కువకాలం మన్నికగా ఉండాలని భావిస్తే దీన్ని ఎంచుకోవచ్చు. నాణ్యత, డిజైన్‌లో మిగతా వాటికి భిన్నంగా ఉంటుంది. మందం 0.05 అంగుళాలు.


Supcase Webcam Cover 
పరిమాణం కాస్త పెద్దగా ఉన్నా మా గ్యాడ్జెట్ల పనితీరు బాగుంటుంది అంటోంది తయారీ కంపెనీ. రెండు సైజుల్లో అందుబాటులో ఉంది. ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌ఫోన్‌, పీసీ.. దేనికైనా ఇవి అనుకూలం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న