ఇక రక్తనాళ ముద్రలు!
close

Updated : 21/07/2021 05:40 IST

ఇక రక్తనాళ ముద్రలు!

వేలిముద్రలు ప్రత్యేకం. ముఖ కవళికలు ప్రత్యేకం. ఒకరిని పోలినట్టు మరొకరివి ఉండవు. అందుకే వ్యక్తులను గుర్తించటానికి వీటిని వాడుతుంటారు. ఆఫీసుల్లోనూ హాజరు నమోదుకు వేలిముద్రలు, ఫేస్‌ రికగ్నిషన్‌ స్కానర్లను ఉపయోగిస్తుండటం తెలిసిందే. ఇవేకాదు.. అరచేతి రక్తనాళాలనూ ఇందుకు వినియోగించుకోవచ్చని యూనివర్సిటీ ఆఫ్‌ న్యూ సౌత్‌వేల్స్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకోసం ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాతో ఓ ప్రత్యేక పద్ధతినీ రూపొందించారు. వేలిముద్రల మాదిరిగానే అరచేతి వెనక వైపున ఉండే రక్తనాళాలూ ప్రత్యేకమైనవే. అందుకే ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాతో చేతి రక్తనాళాల ఫొటోలను తీసి, కృత్రిమ మేధ సాయంతో వీటిని గుర్తించేలా కంప్యూటర్‌కు శిక్షణ ఇచ్చారు. ఇది 99.8% కచ్చితత్వంతో ఆయా వ్యక్తులను గుర్తించటం విశేషం. వేలిముద్రలు, ఫేస్‌ రికగ్నిషన్‌ స్కానర్లకు ప్రత్యామ్నాయంగా దీన్ని వాడుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. వేలిముద్రలను మృదువైన వస్తువుల మీద తీసుకొని స్కానర్లను బోల్తా కొట్టించొచ్చు. ఫొటోలను చూపించి ఫేస్‌ రికగ్నిషన్‌ స్కానర్లను బురిడి కొట్టించొచ్చు. కొన్నిరకాల చర్మం రంగులనూ ఇవి అంతగా గుర్తించలేవు. ఈ నేపథ్యంలో రక్తనాళాల స్కానర్లు బాగా ఉపయోగపడగలవని భావిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌తోనూ వీటిని వాడుకునే వీలుండటం గమనార్హం. నిఘా కెమెరాల్లోనూ వాడుకోవచ్చు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న