10,00,00,000 అంతరిక్ష వ్యర్థాలు!
close

Published : 22/09/2021 01:13 IST
10,00,00,000 అంతరిక్ష వ్యర్థాలు!

పగ్రహ వ్యర్థాలతో అంతరిక్షం రోజురోజుకీ చెత్తకుప్పలా మారుతోంది. ప్రస్తుతం గోలికాయ, అంతకన్నా పెద్ద సైజు వ్యర్థాలు 5 లక్షల వరకు ఉన్నాయని అంచనా. అదే చిన్న సైజు వ్యర్థాల సంఖ్య 10కోట్లకు పైనే! వీటిల్లో ఇప్పటివరకు 27,000 వ్యర్థాలనే గుర్తించారు. చూడటానికివి చిన్నవే అయినా ఉపగ్రహాలకు పెద్ద ప్రమాదాన్నే తెచ్చిపెడతాయి. నట్లు, బోల్టులు, గడ్డకట్టిన రాకెట్‌ ఇంధనం రేణువులు.. చివరికి రంగు పెచ్చులు సైతం భారీ నష్టాన్ని కలిగిస్తాయి. ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం రోబోటిక్‌ చేయికి రంధ్రం పడటానికి కారణం ఇవేనని భావిస్తున్నారు. ఈ సంవత్సరం జనవరి వరకు 6,542 ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరుగుతుండగా.. వీటిల్లో చురుకుగా పనిచేసేవి సగమే. వచ్చే దశాబ్దంలో నాలుగింతలు ఎక్కువగా ఉపగ్రహాలను ప్రయోగించే అవకాశముంది. జనవరిలో ఒక్క స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌ రాకెట్‌ ద్వారానే 143 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టారు. సౌలభ్యం మాట పక్కనపెడితే ఇవన్నీ మున్ముందు అంతరిక్ష వ్యర్థాలు పోగుపడటానికి దారితీసేవే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న