ఇతరులతోనూ కలిసిఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్స్‌, రీల్స్‌
close

Published : 27/10/2021 01:58 IST

ఇతరులతోనూ కలిసిఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్స్‌, రీల్స్‌

న్‌స్టాగ్రామ్‌లో ఒకోసారి పోస్ట్‌లు, రీల్స్‌ను ఇతరులతో కలిసి పంచుకుంటే బాగుంటుందని అనిపిస్తుంటుంది. అంటే ఇద్దరు కలిసి ఒకే పోస్ట్‌ చేయటం అన్నమాట. ఇలా ఇద్దరికి సంబంధించిన అభిప్రాయాలను, వీడియో దృశ్యాలను ఒకేచోట ఉండేలా చూసుకోవటానికి వీలవుతుంది. ఎవరి ఖాతా వారిదేనాయె. అదెలా సాధ్యపడుతుంది? ఇంతకుముందైతే వీలుండేది కాదు గానీ ఇప్పుడు సాధ్యమే. ఇందుకోసం ఇన్‌స్టాగ్రామ్‌ కొత్తగా ‘కొలాబ్‌’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది మరి. దీంతో ఫీడ్‌ పోస్ట్స్‌, రీల్స్‌ను సంయుక్తంగా పంచుకోవచ్చు. తమ పోస్ట్‌, రీల్స్‌కు ఇతరులను ఆహ్వానించి, వారి భావాలనూ వెల్లడించుకోవటానికి వీలవుతుంది. హెడర్‌ మీద ఇద్దరి పేర్లూ కనిపిస్తాయి. పోస్టులు వారి వారి ఫాలోవర్లకు ఉమ్మడిగా కనిపిస్తాయి. కామెంట్లు, వ్యూలు, కౌంట్లు.. ఇలాంటివన్నీ ఒకే థ్రెడ్‌ మీద దర్శనమిస్తాయి కూడా.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న