టెరా యుగం షురువైంది
close

Updated : 29/09/2021 05:50 IST

టెరా యుగం షురువైంది

స్మార్ట్‌ఫోన్ల స్టోరేజీలో కొత్త శకం మొదలైంది. త్వరలో 64జీబీకి కాలం చెల్లిపోయి, టెరాబైట్‌ (టీబీ) యుగం ఆరంభం కానుంది. ఇటీవలే యాపిల్‌ సంస్థ ఒక టీబీ వరకు స్టోరేజీతో కూడిన ఐఫోన్‌13 ప్రొ మోడళ్లను ప్రకటించింది. దీంతో 64జీబీ అంతానికి నాంది పలికినట్టయ్యిందని టెక్‌ నిపుణులు భావిస్తున్నారు. నిజానికి టెరాబైట్‌ మార్పునకు సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌10 ప్లస్‌తోనే పునాది పడినప్పటికీ.. ట్రెండ్‌ను సెట్‌ చేసేది యాపిలే మరి. వీక్షిస్తున్న వీడియోల నాణ్యత, సృష్టిస్తున్న వీడియోల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే 128 జీబీ కన్నా తక్కువ స్టోరేజీ ఫోన్లకు ఇప్పుడు కాలం చెల్లిందనే అనుకోవచ్చు. ఒకవైపు పెరిగిపోతున్న యాప్‌ అప్‌డేట్లు, మరోవైపు గ్రాఫిక్స్‌తో కూడిన గేమ్స్‌ వంటివి ఇట్టే 1జీబీ వరకు స్పేస్‌ తీసేసుకుంటున్నాయి. మరి 64 జీబీ స్టోరేజీ ఎక్కడ సరిపోతుంది. ఒకప్పుడు 16జీబీ అంటేనే ఎక్కువ స్టోరేజీ కింద లెక్క. యాపిల్‌ 2016లో 32జీబీతో ఐఫోన్‌ 7 తీసుకొచ్చిన వెంటనే 16జీబీకి కాలం చెల్లినట్టయ్యింది. అనంతరం స్టోరేజీ 64 జీబీ, 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ.. ఇలా పెరుగుతూనే వస్తోంది. ప్రస్తుత అవసరాల దృష్ట్యా ఇది టీబీకీ ఎగబాకింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న