ఆపత్కాలంలో అండగా వెబ్‌సైట్లు
close

Updated : 26/05/2021 12:18 IST
ఆపత్కాలంలో అండగా వెబ్‌సైట్లు

ఆసుపత్రుల్లో పడకల్లేవు. అందుబాటులో ఆక్సిజన్‌ లేదు. అత్యవసర ఔషధాలు ఎక్కడ దొరుకుతాయో తెలియదు. ఈ ఆపత్కాలంలో ఎన్ని ఇబ్బందులో! వీటిని తీర్చే సమాచార వారధులు ఈ వెబ్‌సైట్లు, యాప్‌లు.


findabed.in

దీన్ని ఇండియాస్‌ ఇంటర్నేషనల్‌ మూవ్‌మెంట్‌ టు యునైటెడ్‌ నేషన్స్‌ (ఐఐఎంయూఎన్‌) నిర్వహిస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద యూత్‌ ఆర్గనైజేషన్లలో ఒకటి. దేశంలోని 446 నగరాల్లోని ఆసుపత్రుల్లో ఉన్న బెడ్‌ల వివరాలు ఇందులో తెలుసుకోవచ్చు. ఉచిత, పెయిడ్‌ బెడ్‌ల వివరాలన్నీ చూపిస్తుంది.


covidrelief.glideapp.io

ముగ్గురు ఐఐటీ దిల్లీ గ్రాడ్యుయేట్లు ఈ వెబ్‌సైట్‌కి రూపకల్పన చేశారు. ఆసుపత్రి బెడ్లు, ఆక్సిజన్‌, ఔషధాలు.. ఏది కావాలన్నా రియల్‌టైం డేటా అందుబాటులో ఉంటుంది. మొత్తం పదకొండు నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. సర్వీసు ఉచితం.


so city

ఈ మైక్రోసైట్‌ దిల్లీ నగరంలో మాత్రమే పని చేస్తోంది. ఆక్సిజన్‌, రక్తం, అంబులెన్స్‌, ఆసుపత్రి బెడ్లు, మెడిసిన్‌, శ్మశానంలో అంత్యక్రియలు, శానిటైజేషన్‌.. ఇలా ప్రతీ సమాచారం అందుబాటులో ఉంటుంది. వివరాలు ధ్రువీకరించిన తర్వాతే సైట్‌లో పెడుతున్నారు.


sprinkir

ఇంతకుముందు ఈ వెబ్‌సైట్‌ ఇతర రకాల సేవలందించింది. కరోనా ఉద్ధృతి పెరిగాక ప్రజల ఇబ్బందులపై పని చేస్తోంది. ఇందులో ముందు మనం ఉంటున్న ప్రాంతం వివరాలు అందించాలి. తర్వాత ఆ దగ్గర్లోని ఆసుపత్రులు, బెడ్లు, ఆక్సిజన్‌, వాక్సినేషన్‌, మందులు.. ఈ వివరాలన్నీ డాష్‌బోర్డుపై ప్రత్యక్షం అవుతాయి.


vaccinateme

కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవడం ఇప్పుడు గగనం అయిపోయింది. స్లాట్‌ బుక్‌ చేసుకుందామన్నా కనీసం ప్రభుత్వ వెబ్‌సైట్‌ తెరుచుకోని పరిస్థితి. ‘హెల్దీఫైమీ’ రూపొందించిన వ్యాక్సినేట్‌మీ క్షణాల్లో మొత్తం సమాచారాన్ని మనకు అందుబాటులో ఉంచుతుంది.


getjab.in

ఇది మన పిన్‌కోడ్‌ ఆధారంగా అందుబాటులో ఉన్న వ్యాక్సినేషన్‌ స్లాట్‌ల గురించి చెబుతుంది. కొవిన్‌ వెబ్‌సైట్‌ నుంచే సమాచారం తీసుకున్నా యూజర్‌ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్‌తో ఉంటుంది. దీన్ని 18 నుంచి 44 ఏళ్ల వయసున్న వారి కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న