వాడిచూస్తే.. వారెవ్వా అనాల్సిందే! 
close

Updated : 23/02/2021 18:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
వాడిచూస్తే.. వారెవ్వా అనాల్సిందే! 

ఇన్‌స్టాల్‌ చేయడం.. వాడడం.. కొన్నింటిని మర్చిపోవడం. యాప్‌ల వాడకంలో ఎప్పుడూ ఉండేదే. కానీ, కొన్ని యాప్‌ల్ని మాత్రం ఒక్కసారి ఇన్‌స్టాల్‌ చేస్తే ఎప్పటికీ మర్చిపోవడం ఉండదు. వాటికి ఉండే ప్రయోజనం అలాంటిది. ఇవిగోండి కొన్ని యాప్‌లు. వాడి చూడండి..

నోటిఫికేషన్‌ మాదిరిగా ‘నోట్స్‌’

ఫోన్‌ చేతిలోకి తీసుకుంటే చాలు...కొన్ని సార్లు అన్నీ మర్చిపోతుంటాం. అమ్మ తెమ్మని చెప్పిన సరకులు కావొచ్చు... బాస్‌ పెట్టిన డెడ్‌లైన్‌లు అయ్యుండొచ్చు. అలా జరగకుండా.. ముఖ్యమైనవి ఏవీ మర్చిపోకుండా ఉండాలంటే? ఈ యాప్‌ని ప్రయత్నించొచ్చు. దీంట్లో రాసుకున్న విషయాలన్నీ ఎప్పుడూ నోటిఫికేషన్‌లా కనిపిస్తూనే ఉంటాయి. అంటే.. మీరెప్పుడు ఫోన్‌ను అన్‌లాక్‌ చేసినా నోట్స్‌ కనిపిస్తుంది. దీంతో విషయాల్ని మీరెప్పటికీ మర్చిపోరు. క్రియేట్‌ చేసుకున్న నోట్స్‌ని తొలగించొచ్చు. కావాలంటే.. ఎప్పుడైనా ఎడిట్‌ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్‌ లింక్‌: Notification Notes

భిన్నంగా బ్రౌజింగ్‌..

ఫోన్‌లో బ్రౌజింగ్‌ అంటే.. బిల్ట్‌ఇన్‌గా ఉన్నవే మాత్రమే కాదు... ఇంకా చాలానే ఉన్నాయి. కావాలంటే దీన్ని ఇన్‌స్టాల్‌ చేసి చూడండి. అప్పటికే ప్రైమరీ బ్రౌజర్‌గా మీరు వాడుతున్న క్రోమ్, ఫైర్‌ఫాక్స్‌తో కలిసి పని చేస్తుంది. క్షణాల్లో వెబ్‌ పేజీలను లోడ్‌ చేస్తూ బ్రౌజింగ్‌ చేయడానికి ఇది అనువైంది. ఇతర బ్రౌజర్‌లతో సింక్‌ అయ్యి పని చేస్తుంది. ఎక్కువ లింక్‌లను ఓపెన్‌ చేసినప్పుడు వాటిని తెరపై బబుల్స్‌లా పెట్టుకుని లోడ్‌ చేయొచ్చు. అంతేకాదు.. డెస్క్‌టాప్‌లో మాదిరిగా ట్యాబ్‌ల పద్ధతిలో లింక్‌లను ఓపెన్‌ చేయొచ్చు. ఎక్కువ వెబ్‌ లింక్‌లను ఓపెన్‌ చేయాల్సివస్తే.. మినిమైజ్‌ చేసుకునే వీలుంది. కొంత సమయం ముందు (రీసెంట్‌) చూసిన అన్ని వెబ్‌ పేజీలను జాబితాగా చూపిస్తుంది. ఓపెన్‌ చేసిన వెబ్‌ పేజీలు, వ్యాసాల్ని షేర్‌ చేయడం సులభం. డౌన్‌లోడ్‌ లింక్‌: Lynket

కొత్తగా స్వైప్‌ చేయండి..

ఫోన్‌ కొన్నది మొదలు కుడి, ఎడమకి స్వైప్‌ చేస్తూ చాలానే చేస్తుంటాం. అదంతా మామూలే. కానీ, స్వైప్‌ చేసినప్పుడు ప్రత్యేకంగా ఏదైనా కమాండ్‌ రన్‌ అయితే! అదెలాగంటే.. ఫోన్‌ కింది భాగం నుంచి పైకి స్వైప్‌ చేస్తే మ్యూజిక్‌ వాల్యూమ్‌ పెరుగుతుంది. కుడి నుంచి ఎడమకి స్వైప్‌ చేస్తే ఫోన్‌ లాక్‌ అవుతుంది. స్క్రీన్‌షాట్‌ తీసుకోవచ్చు.. నోటిఫికేషన్స్‌ని చూడొచ్చు.. ఇలా కుడి, ఎడమ, కింది అంచుల నుంచి తెరని స్వైప్‌ చేయడం ద్వారా ఇంకా చాలానే చేయొచ్చు. డౌన్‌లోడ్‌ లింక్‌: Full Screen Gestures

కాపీ చేయలేకపోతే.. 

ఫోన్‌లో టెక్స్ట్‌ని సెలెక్ట్‌ చేసి కాపీ, పేస్ట్‌ చేస్తుంటాం. కానీ, అన్ని యాప్‌ల్లోనూ ‘లాంగ్‌ప్రెస్‌’ ద్వారా కాపీ చేయడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు ఈ యాప్‌తో చిటికెలో కాపీ చేసుకోవచ్చు. ఇన్‌స్టాల్‌ చేశాక ఏదైనా యాప్‌లో టెక్స్ట్‌ని కాపీ చేయాల్సివస్తే యూనివర్సల్‌ కాపీ మోడ్‌ని యాక్టివేట్‌ చేస్తే సరిపోతుంది. ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌... ఇలా దేంట్లో నుంచి అయినా టెక్స్ట్‌ని క్షణాల్లో కాపీ చేసి తీసుకోవచ్చు. డౌన్‌లోడ్‌ లింక్‌: Universal Copy

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న

రుచులు