పబ్‌జీని తలదన్నే యుద్ధభూమి
close

Updated : 19/05/2021 07:24 IST
పబ్‌జీని తలదన్నే యుద్ధభూమి

బ్‌జీ గేమ్‌ భారత్‌లో ఎంత సంచలనం సృష్టించిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. టీనేజీ, కుర్రకారు చాలామంది 24 గంటలూ దీనికి అతుక్కుపోయినవారే. ఈ చైనా యాప్‌పై ప్రభుత్వం గత సంవత్సరం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆ ఊపును ఎలాగైనా కొనసాగించాలనే ఉద్దేశంతో పబ్‌జీని రూపొందించిన ‘క్రాఫ్టాన్‌’ అనే సంస్థ ‘బ్యాటిల్‌గ్రౌండ్‌ మొబైల్‌ ఇండియా’ పేరుతో భారత్‌లో కొత్త గేమ్‌ లాంచ్‌ చేయనున్నామని ప్రకటించింది. వర్చువల్‌ సిమ్యులేషన్‌ మైదానం, స్టైలిష్‌ పాత్రలు, గ్రీన్‌ హిట్‌ ఎఫెక్ట్‌లు, ఔట్‌ఫిట్స్‌ లాంటి ప్రత్యేకతలతో దీన్ని రూపొందిస్తున్నారు. ఇందులో హింసకు ప్రాధాన్యం తగ్గించినా ఎఫెక్ట్స్‌, టెక్నాలజీలో పబ్‌జీ గేమ్‌కి ఏమాత్రం తగ్గకుండా ఎన్నో రకాల ఆకర్షణలు ఉంటాయని కంపెనీ చెబుతోంది. వినియోగదార్ల గోప్యత, డేటా రక్షణ, భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామంటోంది. బ్యాటిల్‌గ్రౌండ్‌కు మీరూ ‘సై’ అనాలనుకుంటే ఆండ్రాయిడ్‌ యూజర్లయితే గూగుల్‌ ప్లే స్టోర్‌లోకి వెళ్లి ముందుగా రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న