అలెక్సా ‘భౌ.. భౌ..’ అంటోంది..
close

Updated : 24/02/2021 17:04 IST

అలెక్సా ‘భౌ.. భౌ..’ అంటోంది..

అదెట్టా!

రికి వెళ్తున్నప్పుడు ఇంటికి కాపలాగా కుక్కని వదిలి వెళ్లడం కొత్తేమీ కాదు. అమెజాన్‌ స్పీకర్‌ కుక్కగా మారటమే వింత! ఇప్పుడు కాలం మారింది మరి. ఇంట్లో అమెజాన్‌ స్పీకర్‌ ఉంటే చాలు. మీరు ఇంట్లో లేనప్పుడు.. ఏదైనా అలికిడి అయితే అలెక్సానే కుక్కలా మొరుగుతూ భయపెడుతుంది. ఇప్పటి వరకూ ఇష్టమైన సంగీతం, వాతావరణ విశేషాలు, మరెన్నో కబుర్లు చెప్పిన అలెక్సా ఇకపై ‘అలెక్సా గార్డ్‌ ప్లస్‌’తో ఇంటికి రక్షణగా నిలుస్తుంది. అత్యవసర సమయాల్లో ‘అలెక్సా.. కాల్‌ ఫర్‌ హెల్ప్‌’ అని పిలిస్తే చాలు. ఎమర్జెన్సీ సర్వీసులకు సమాచారం అందిస్తుంది. అంతేకాదు.. మీరు ఇంట్లో లేనప్పుడు ఏవైనా అలికిడి శబ్దాలు వినిపిస్తే ఫోన్‌కి అలర్ట్‌ పంపుతుంది. కుక్కలా మొరుగుతూ.. ఇంట్లో మనుషులు ఉన్నట్టుగానే లైట్లు ఆన్‌, ఆఫ్‌ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే.. ఎవరైనా కిటికీ అద్దాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తే.. అద్దం పగిలిన శబ్దాన్ని పసిగట్టి అలర్ట్‌ చేస్తుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న