close

Updated : 24/02/2021 17:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చెవికెక్కాయ్‌ కొత్తగా..

ఫోన్‌లను వైర్‌లెస్‌గా ఛార్జ్‌ చేసేస్తున్నాం. ఇకపై ఇయర్‌ ఫోన్‌లను కూడా చేసేయొచ్చు. కావాలంటే పీట్రాన్‌ కొత్తగా మార్కెట్‌లోకి తెచ్చిన ‘బాస్‌బడ్స్‌ విస్టా’ ఇయర్‌బడ్స్‌ని చూడండి. 5వాట్‌ వైర్‌లెస్‌ ఛార్జర్‌తో ఛార్జ్‌ చేయొచ్చు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 12 గంటలు వాడుకోవచ్చు. నాణ్యమైన ఆడియో అవుట్‌పుట్‌తో వీటిని తీర్చిదిద్దారు. ఛార్జింగ్‌ సామర్థ్యాన్ని తెలుపుతూ ఛార్జింగ్‌ కేస్‌కి బ్యాటరీ ఇండికేటర్‌ ఉంది. బ్లూటూత్‌ 5.1 టెక్నాలజీతో డివైజ్‌లకు కనెక్ట్‌ అవుతుంది. 10 మీటర్ల పరిధిలో ఎలాంటి సమస్య లేకుండా వాడుకోవచ్చు. వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌తో పని చేసేవంటే ఖరీదు ఎక్కువని అనుకోనక్కర్లేదు. బడ్జెట్‌ ధరలోనే అందుబాటులో ఉంది.
ధర రూ.1,199


 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న

రుచులు