ఉచిత ఆఫీస్‌
close

Updated : 29/09/2021 06:01 IST

ఉచిత ఆఫీస్‌

ర్డ్‌, ఎక్సెల్‌, పవర్‌ పాయింట్‌.. ఒక్క మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌తోనే ఎన్నెన్నో డాక్యుమెంట్లను సృష్టించుకోవచ్చు. ప్రొడక్టివిటీ సాఫ్ట్‌వేర్‌లో దీన్ని మించింది లేదు. కాకపోతే ఖరీదు ఎక్కువ. అందుకే చాలామంది వెనకాడుతుంటారు. ఇలాంటివారి కోసం ఉచిత సాఫ్ట్‌వేర్స్‌ అందుబాటులో లేకపోలేదు. వీటిల్లో ఒకటి లీబ్రాఫిస్‌. ఇదో ఓపెన్‌ సోర్స్‌ ఆఫీస్‌ సూట్‌. ఉచితమే అయినా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతుంది. ఇందులో రైటర్‌, ఇంప్రెస్‌, కాల్క్‌ వంటి ఆరు ప్రోగ్రామ్‌లను వినియోగించుకోవచ్చు. ఇవి అచ్చం మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌, పవర్‌ పాయింట్‌, ఎక్సెల్‌ మాదిరిగానే పనిచేస్తాయి. అధీకృత ఎంఎస్‌ ఆఫీస్‌లో సృష్టించిన ఫైళ్లనూ ఇందులో ఎడిట్‌ చేసుకోవచ్చు. కొత్త ఫైళ్లను ఆఫీస్‌ ఫార్మాట్‌లోనూ సేవ్‌ చేసుకోవచ్చు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న