close

Updated : 13/02/2021 13:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రేమికుల రోజు స్పెషల్‌.. బహుమతి ఇవ్వాలిగా!

ప్రేమికుల రోజు వస్తోందంటే చాలు.. ప్రేమని ఇచ్చి పుచ్చుకున్నట్టుగానే.. బహుమతులు కూడా ఇరువురి మధ్య చేతులు మారుతుంటాయి. అవి ఖరీదైనవి కొన్నయితే.. చౌకయినా మనసు దోచేవి ఇంకొన్ని.. ఆ జాబితాలో కచ్చితంగా గ్యాడ్జెట్‌లు ఉండి తీరాల్సిందే. మరైతే, ప్రేమ కానుకగా ఇచ్చేందుకు ఇవిగోండి కొన్ని గ్యాడ్జెట్‌ ఐడియాలు.. మీ మనసు దోచిన వారు టెక్నాలజీ ప్రియులైతే ఇంప్రెస్‌ చేసేందుకు చక చకా సిద్ధం అయిపోండి..

మణికట్టుపై మురిపెంగా..

మనసుకి నచ్చిన వారిని నిత్యం రిమైండ్‌ చేసేందుకు మణికట్టుకి ఏదోక ఒకటి ధరించడం ఎప్పటి నుంచో ఉన్నదే. ఇప్పుడు అవి స్మార్ట్‌గా మారిపోతున్నాయ్‌. ఆధునిక డిజైన్‌లతో కూడిన స్మార్ట్‌ వాచ్‌లను సెలెక్ట్‌ చేసుకుంటున్నారు. మీరూ ఈ ప్రేమికుల రోజుకి ప్రీమియం గిఫ్ట్‌ ఇద్దాం అనుకుంటే ‘యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 6 (రూ.40,900) లేదా శామ్‌సంగ్‌ గెలాక్సీ వాచ్‌ 3’లను (రూ.29,990) ఎంపిక చేయొచ్చు. మరీ.. అంత ఎక్కువ బడ్జెట్‌లో వద్దు అనుకుంటే ‘ఒప్పో వాచ్‌’ (రూ.12,990) లేదంటే ‘ఎంఐ వాచ్‌ రిసాల్వ్‌’ (రూ.7,999)లను సెలెక్ట్‌ చేసుకోండి. ఇంకాస్త ట్రెండీ డిజైన్‌లతో ఈ జనరేషన్‌ని ఆకట్టుకునేలా ‘అమాజ్‌ఫిట్‌ జీటీఆర్‌ 2ఈ’ని (రూ.9,999) చూడొచ్చు. కర్వ్‌ బెజెల్లెస్‌ డిజైన్‌తో వాచ్‌ మొత్తం స్క్రీన్‌ కనిపించేలా తీర్చిదిద్దారు.

ఫిట్‌గా ఉండాలని కోరుతూ..

ప్రేమ ఎప్పుడూ తన వారి శ్రేయస్సుని కోరుతుంది. మీరు ప్రేమించిన వారిని కూడా ఫిట్‌గా చూసేందుకు.. వారి ఆర్యోగంపై ఓ కన్నేసేందుకు ‘ఫిట్‌నెస్‌ ట్రాకర్స్‌’ని గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. ఇంచుమించు అన్నీ బడ్జెట్‌లోనే అందుబాటులో ఉన్నాయి. ‘ఎంఐ స్మార్ట్‌ బ్యాండ్‌ 5’ని (రూ.2,499) తీసుకుంటే ఉండీ.. లేనట్టుగానే మణికట్టుపై మాయ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేసి రెండు వారాలు వాడుకోవచ్చు. ఇంకాస్త స్టైలీ లుక్‌తో ‘వన్‌ప్లస్‌ బ్యాండ్‌’ (రూ.2,499) ఉంది. మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. ఇంకాస్త తక్కువ ధరలో ఏమైనా ఉన్నాయా? అని ఆలోచిస్తే.. ‘రియల్‌ మి’ (రూ.1,499) బ్యాండ్‌ని ప్రయత్నించొచ్చు. యువతకు నచ్చే రంగుల్లో భిన్నమైన లుక్‌తో ఇవి అలరిస్తున్నాయి. 

మ్యూజిక్‌ ప్రియులైతే..

లైవ్‌ ట్యూన్స్, ట్రాక్స్‌ వినందే లవర్స్‌కి అస్సలు టైమ్‌పాస్‌ అవ్వదు. ఇష్టమైన ట్రాక్స్‌కి ఇద్దరూ కలిసి వింటూ ఎంజాయ్‌ చేస్తుంటారు. ఈ క్రమంలో మంచి హెడ్‌ఫోన్‌లను ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేద్దాం అనుకుంటే.. ఖరీదైనా ‘యాపిల్‌పాడ్స్‌ మ్యాక్స్‌’ని (రూ.59,900) ఇవ్వొచ్చు. ఐ‘ట్యూన్స్‌’లో ఇప్పటికి ఇదే రారాజు. ఇంకాస్త తక్కువ బడ్జెట్‌లో సోనీ అందిస్తున్న ‘డబ్ల్యుహెచ్‌-1000ఎక్స్‌ఎం4’ (రూ.24,990) వైర్‌లెస్‌ హెడ్‌ఫోన్‌ని ఎంచుకోవచ్చు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 30 గంటలు వినొచ్చు. క్విక్‌ ఛార్జ్‌తో వేగంగా ఛార్జ్‌ చేయొచ్చు. మరీ అంత హై రేంజ్‌ వద్దులే అనుకుంటే ‘లైపర్‌టెక్‌ టీఈవీఐ’ (రూ.7,999) ఇయర్‌బడ్స్‌ని ఇవ్వొచ్చు. స్టీరియా హై-ఫై సౌండ్‌తో మ్యూజిక్‌ అదుర్సే! 70 గంటల ప్లే టైమ్‌. మెడపై నెక్లెస్‌లా ఒదిగిపోయి ఉండేలా ‘వన్‌ప్లస్‌ బుల్లెట్స్‌ వైర్‌లెస్‌ జెడ్‌’ (రూ.1,999) మంచి ఎంపికే.

స్పీకర్లు ఇచ్చేట్టు అయితే..

గతంలో స్పీకర్లు అంటే.. కేవలం పాటలు వినేందుకు మాత్రమే. ఇప్పుడు వస్తున్న స్మార్ట్‌ స్పీకర్లతో చాలానే చేయొచ్చు. ఇష్టమైన ట్రాక్స్‌ వినడంతో పాటు.. లవర్‌తో కాల్స్‌ మాట్లాడొచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఓ వాయిస్‌ అసిస్టెంట్‌ని నియమించుకుని ఆర్డర్లు ఇవ్వొచ్చు. ఇన్ని సౌకర్యాలున్న స్మార్ట్‌ స్పీకర్లను గిఫ్ట్‌గా ఇద్దాం అనుకుంటే.. ‘గూగుల్‌ నెస్ట్‌ ఆడియో’ (7,999) ఉంది. గూగుల్‌ అసిస్టెంట్‌తో ఇష్టమైన లవ్‌ ట్రాక్స్‌ని వినడంతో పాటు ఇంటిని స్మార్ట్‌ హోమ్‌గానూ మార్చేయొచ్చు. కాస్త చౌక ధరలో అందుబాటులో ఉన్న మరో స్పీకర్‌ ‘ఎంఐ స్మార్ట్‌ స్పీకర్‌’ (రూ.3,999). డీటీఎస్‌ ప్రొఫెషనల్‌ ట్యూన్డ్‌ సౌండ్‌తో మ్యూజిక్‌ వినొచ్చు. సాధారణ బ్లూటూత్‌ స్పీకర్‌లా 2.1 ఛానల్‌ సరౌండ్‌ సౌండ్‌ సిస్టమ్‌తో మ్యూజిక్‌ వినేందుకు తగినది ‘రియల్‌ మి 100 వాట్‌ సౌండ్‌ బార్‌’. సబ్‌ పూఫర్‌తో పాటు పాందొచ్చు. 

స్మార్ట్‌ హోమ్‌నే ఇవ్వొచ్చు

ప్రేమికుల రోజున ఇల్లాలిని స్మార్ట్‌గా ఇంప్రెస్‌ చేసేందుకు ఇంటిని స్మార్ట్‌ హోమ్‌గా మార్చేసే గ్యాడ్జెట్‌లను బహుమతిగా ఇవ్వొచ్చు. స్మార్ట్‌ బల్బ్‌లు, స్మార్ట్‌ ఎయిర్‌ ప్యూరిఫయర్, బ్లూటూత్‌ ట్రాకర్లు.. ఇలా చెప్పాలంటే చాలానే ఉన్నాయి. ఎంఐ అందించే ఎయిర్‌ ప్యూరిఫయర్లను చూడొచ్చు. రూ.1,699 నుంచి రూ.9,999 మధ్య పలు రకాల మోడళ్లను ఎంపిక చేసుకోవచ్చు. బడ్జెట్‌ ఎక్కువైనా ఒకే అనుకుంటే డైసన్‌ అందించే ‘ప్యూర్‌ కూల్‌’ని (రూ.45,900) ఎంచుకోవచ్చు. అలాగే, మీ లవ్‌మేట్‌కి ఓ బ్లూటూత్‌ ట్రాకర్‌ని ఇద్దాం అనుకుంటే ‘టైల్‌ మేట్‌ కీ ఫైండర్‌’ (రూ.4,999) ఇవ్వొచ్చు. విలువైన వాటిని పోగొట్టుకోకుండా దీన్ని వాడుకోవచ్చు.  

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న

రుచులు