close

Updated : 07/04/2021 22:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గూగుల్‌  వెతుకులాటలో కొత్తగా..

ఏ సందేహం వచ్చినా గూగుల్‌పై వాలిపోతాం. వెతికేస్తాం. ఈ క్రమంలో గూగుల్‌ కూడా సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది. వాటిల్లో డార్క్‌మోడ్‌, ఇన్ఫోకార్డులు ఆన్‌లైన్‌ సెర్చ్‌ సర్వీసులో సందడి చేస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా మరికొన్ని ఫీచర్లను గూగుల్‌ అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు ప్రత్యేకంగా వాటిని వాడుకోవచ్చు. పాఠ్యాంశాలకు సంబంధించినవి వెతికే క్రమంలో కొత్తగా జత చేసినవి ఎంతో ఉపయోగపడతాయి. సెర్చ్‌ ఫలితాల్ని భిన్నంగా మార్చేస్తాయి. ఇంతకీ విద్యార్థులకు ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఫీచర్ల సంగతులేంటో చూద్దామా..


ఇంటరాక్టివ్‌ క్విజ్‌లు

గూగుల్‌లో ఏదైనా వెతికితే బోల్డన్ని వెబ్‌ పేజీలు కుప్పలుగా వచ్చేస్తాయి. వాటిల్లో కావాల్సిన వాటిని వెతికి ఓపెన్‌ చేస్తాం. ఇలా పదే పదే కళ్లు కాయలు కాసేలా సెర్చ్‌ రిజల్ట్‌లను వెతికే పని లేకుండా విద్యార్థులు వినూత్నంగా గూగుల్‌ సెర్చ్‌ చేసేలా ‘ఇంటరాక్టివ్‌ క్విజ్‌’లు జత అయ్యాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, పేరెంట్స్‌.. వాటిని ఇట్టే యాక్సెస్‌ చేయొచ్చు. కరోనా కారణంగా చదువులు ఇంటికే పరిమితం అయిన నేపథ్యంలో గూగుల్‌ ఈ తరహా రిమోట్‌ లెర్నింగ్‌కి అవకాశం కల్పిస్తోంది. అదెలాగంటే.. గూగుల్‌ సెర్చ్‌లోకి వెళ్లి Physics Practice Problems అని ఎంటర్‌ చేసి చూడండి. సెర్చ్‌ రిజల్ట్‌ల ప్రారంభంలో చూడండి. ప్రత్యేక ఫార్మాట్‌లో క్విజ్‌లు కనిపిస్తాయి. పలు ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫామ్‌లు అందించే వాటిని ఒక్కొక్కటిగా యాక్సెస్‌ చేయొచ్చు. క్విజ్‌లకు మీరిచ్చే సమాధానాల ఆధారంగా ఆయా పాఠ్యాంశాలపై మీకెంత పట్టు ఉందో తెలుసుకోవచ్చు. Trigonometry Problems అనే కీవర్డ్‌తో గణితశాస్త్ర ప్రశ్నలతో కూడిన పజిల్‌ని చూడొచ్చు. సాధన చేయొచ్చు.


అగ్మెంటెడ్‌ రియాలిటీ..

వాస్తవ ప్రపంచాన్ని వర్చువల్‌ వరల్డ్‌ని టెక్నాలజీ మిళితం చేసేస్తోంది. దానికి నిదర్శనమే అగ్మెంటెడ్‌ రియాలిటీ (ఏఆర్‌). ఎలాంటి అదనపు యాక్ససరీస్‌తో అవసరం లేకుండా.. కేవలం మీరు వాడుతున్న స్మార్ట్‌ ఫోన్‌తోనే ఏఆర్‌ని యాక్సెస్‌ చేయొచ్చు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ఫోన్‌లలో ఈ ఏఆర్‌ టెక్నాలజీని వాడుకుని రిమోట్‌ లెర్నింగ్‌ని మరింత వినూత్నంగా మార్చేయొచ్చు. ఎంపిక చేసుకున్న అంశాల్ని 3డీలో చూడడంతో మీరున్న చోటే ఏఆర్‌లోనూ ప్రదర్శించి చూడొచ్చు. ఉదాహరణకు రసాయన శాస్త్రంలోని ‘కెమికల్‌ బాండ్‌’ గురించి చూద్దాం అనుకుంటే.. ఫోన్‌లోని గూగుల్‌ సెర్చ్‌లో chemical bond కీవర్డ్‌ని ఎంటర్‌ చేయండి. సెర్చ్‌ ఫలితాల్లో ‘వ్యూ ఇన్‌ 3డీ’ కనిపిస్తుంది. ట్యాప్‌ చేసి 3డీలో చూడొచ్చు. ఒకవేళ మీ ఫోన్‌లో ఏఆర్‌ సపోర్టు ఉంటే.. ‘వ్యూ ఇన్‌ యువర్‌ ప్లేస్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్‌ చేసి ఉన్నచోటే ఏఆర్‌లో కెమికల్‌ బాండ్‌ డయాగ్రామ్‌ని చూడొచ్చు. ఇదే మాదిరిగా భౌతికశాస్త్రానికి సంబంధించిన పాఠ్యాంశాల్ని 3డీ, ఏఆర్‌ని వాడుకుని చదువుకోవచ్చు. ఇప్పటికైతే ఈ మొత్తం రిమోట్‌ లెర్నింగ్‌ ఇంగ్లిష్‌ భాషలోనే అందిస్తున్నారు. త్వరలో ఇతర ప్రాంతీయ భాషల్లోనూ గూగుల్‌ అందించేందుకు సిద్ధం అవుతోంది. డెస్క్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లలోనూ ఈ గూగుల్‌ సెర్చ్‌ ఫీచర్స్‌ని యాక్సెస్‌ చేయొచ్చు. వీటితో పాటు మరికొన్ని స్క్రీన్‌ రీడర్స్‌ని అందించే పనిలో ఉంది. దీంతో అంధులు ఇతరుల సాయం లేకుండానే రిమోట్‌ లెర్నింగ్‌ సేవల్ని వాడుకోవచ్చు.


ఇదో స్క్రీన్‌ రీడర్‌..

ఎక్కువ సమయం పాటు ఇంట్లోనే గడపాల్సిన పరిస్థితి. దీంతో పాఠ్యాంశాల గురించో.. పలు రకాల ఇతర అంశాల గురించో కంప్యూటర్‌లో వెతుకుతుంటాం. అలాంటప్పుడు ఎక్కువగా చదవాల్సివస్తుంది. ఇలా స్క్రీన్‌ను ఎక్కువ సమయం చూడడం వల్ల కళ్లు ఒత్తిడికి లోనవుతుంటాయి. అలాంటప్పుడు వెబ్‌ పేజీల్లో ఉన్న పాఠ్యాంశాలు, వ్యాసాల్ని కంప్యూటరే చదివి వినిపిస్తే! కళ్లు మూసుకుని హాయిగా వినొచ్చు. ఇక అంధులకు అయితే ఈ తరహా స్క్రీన్‌ రీడర్లు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే క్రోమ్‌ యూజర్లు ప్రత్యేక ఎక్స్‌టెన్షన్‌ని ప్రయత్నించొచ్చు. అదే Pericles: Text to Speech Screen Reader: క్రోమ్‌ వెబ్‌ స్టోర్‌ నుంచి బ్రౌజర్‌కి జత చేయవచ్చు. అప్పుడు ప్రత్యేక ఐకాన్‌ గుర్తు అడ్రస్‌బార్‌ పక్కన ఉన్న టూల్‌బార్‌లో కనిపిస్తుంది. ఇక ఎప్పుడైనా వెబ్‌ పేజీలోని కంటెంట్‌ని విందాం అనుకుంటే ఎక్స్‌టెన్షన్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేస్తే చాలు. వాయిస్‌ని కావాల్సినట్టుగానే మేనేజ్‌ చేసుకోవచ్చు. అంటే.. వేగం తగ్గించుకుని నెమ్మదిగా చదివేలా సెట్‌ చేసుకోవచ్చు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న

రుచులు