పెద్ద మెయిళ్లను వెతకండిలా
close

Published : 14/07/2021 01:30 IST
పెద్ద మెయిళ్లను వెతకండిలా

చిన్న చిట్కా

జీమెయిల్‌కి ఎన్నో మెయిల్స్‌ వస్తుంటాయి. ఏళ్లకేళ్లుగా అలాగే ఉండిపోతుంటాయి. ఇవి ఎంత స్పేస్‌ తీసుకుంటున్నాయన్నది ఎప్పుడూ పెద్దగా పట్టించుకోం. వీటిల్లో పెద్ద అటాచ్‌మెంట్లతో కూడినవీ ఉండొచ్చు. ఇవి స్టోరేజీని తినేస్తుండొచ్చు. వేలాది మెయిళ్లలో వీటిని వెతకటమంటే కష్టమే. తేలికగా గుర్తించటానికి ఓ చిట్కా ఉంది. జీమెయిల్‌ను ఓపెన్‌ చేసి సెర్చ్‌ బాక్స్‌లో has:attachment larger:10M అని టైప్‌ చేయాలి. అప్పుడు 10ఎం కన్నా పెద్ద మెయిళ్లు ప్రత్యక్షమవుతాయి. వీటిల్లో అనవసరమైనవాటిని ఎంచుకొని డిలిట్‌ చేస్తే సరి. తర్వాత ట్రాష్‌లోకి వెళ్లి ఖాళీ చేసేయాలి. ఇంకా పెద్ద సైజు మెయిళ్లను వెతకాలనుకుంటే 10కి బదులు పెద్ద సంఖ్యను వేయాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న