ఐఓఎస్‌ నుంచి ఆండ్రాయిడ్‌లోకి..
close

Updated : 14/04/2021 17:07 IST
ఐఓఎస్‌ నుంచి ఆండ్రాయిడ్‌లోకి..

అప్‌డేట్‌

చేతిలో ఒక ఫోన్‌ బదులు రెండు ఫోన్‌లు చూడడం సర్వ సాధారణం అయిపోయింది. వీటిల్లో ఒకటి ఐఓఎస్‌.. ఇంకొకటి ఆండ్రాయిడ్‌ ఫోన్‌ అయినా అవాక్కవ్వాల్సిన పని లేదు. మరి ఎప్పుడైనా రెండు ఫోన్‌లలోని వాట్సాప్‌ డేటాని ఒక దాంట్లోంచి మరోదాంట్లోకి ట్రాన్స్‌ఫర్‌ చేయాలంటే? ఉదాహరణకు అప్పటి వరకూ యాపిల్‌ ఫోన్‌లో వాడిన వాట్సాప్‌ అకౌంట్‌ని ఆండ్రాయిడ్‌ ఫోన్‌లోకి మార్చుకోవాలనుకుంటే? ఐఫోన్‌లోని ఛాట్‌ హిస్టరీ మొత్తాన్ని ఆండ్రాయిడ్‌ ఫోన్‌కి పంపాలంటే?  ప్రస్తుతానికైతే అలాంటి ఆప్షనేదీ లేదు. ఎందుకంటే.. యాపిల్‌లో వాట్సాప్‌ బ్యాకప్‌ అంతా ఐక్లౌడ్‌లో ఉంటుంది. ఆండ్రాయిడ్‌లోనైతే వాట్సాప్‌ డేటా గూగుల్‌ డ్రైవ్‌లో బ్యాకప్‌ అవుతుంది. అందువల్ల ఒక దాంట్లోని హిస్టరీని మరో దాంట్లోకి పంపడానికి వీలుకాదు. ప్రత్యేకంగా రిజిస్టర్‌ అయితే తప్ప ఇది సాధ్యం కాదు. ఇకపై అలాంటి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. క్షణాల్లో డేటాని పంపించుకోవడానికి వీలుగా వాట్సాప్‌ త్వరలోనే ట్రాన్స్‌ఫర్‌ డేటా ఫీచర్‌ని పరిచయం చేయనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ప్రయోగాత్మక దశలో ఉంది. కాకపోతే దీని ద్వారా డేటాని ట్రాన్స్‌ఫర్‌ చేయాలంటే.. రెండు ఫోన్‌లలోనూ వాట్సాప్‌ని లేటెస్ట్‌ వెర్షన్‌కి అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే డేటాని పంపడం కుదురుతుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న