బ్లూ టిక్‌ అలాగే ఉండాలంటే...
close

Published : 09/06/2021 00:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
బ్లూ టిక్‌ అలాగే ఉండాలంటే...

ట్విటర్‌ ప్రవేశపెట్టిన ‘బ్లూ టిక్‌’ల మీద ఇటీవల వివాదాలు రేకెత్తుండటం చూస్తూనే ఉన్నాం. కొందరు ప్రముఖుల ఖాతాల్లో బ్లూ టిక్‌లను తొలగించటం పెద్ద దుమారమే లేపింది. అసలు వీటికి ప్రమాణాలేంటి? బ్లూ టిక్‌లు అలాగే ఉండాలంటే ఏం చేయాలి?

క్కువమంది అనుసరించే అకౌంట్ల ప్రామాణికతను తెలియజేయటానికి ట్విటర్‌ ఆయా ఖాతాలకు ధ్రువీకృత  ‘బ్లూ టిక్‌’ కేటాయిస్తోంది. సాధారణంగా ప్రభుత్వం, కంపెనీలు, బ్రాండ్లు, స్వచ్ఛంద సంస్థలు, వార్తా సంస్థలు, జర్నలిస్టులు, వినోదరంగం, క్రీడలు, సామాజిక ఉద్యమకారులు, ఆర్గనైజర్లు, ఇతర ప్రభావశీల వ్యక్తులు.. ఇలా వివిధ విభాగాల వారికి ఇలాంటి సదుపాయం కల్పిస్తోంది. అయితే ప్రతి వారికీ ఈ వెరిఫైడ్‌ అకౌంట్‌ కేటాయించరు. అలాగే బ్లూ టిక్‌లు ఎప్పటికీ అలాగే ఉండవు. ట్విటర్‌ నియమ నిబంధనల మేరకు కొన్నిసార్లు ఎలాంటి వివరణ ఇవ్వకుండానే ‘బ్లూ టిక్‌’లను తొలగించే అవకాశం ఉంది. ఇలా ఎందుకు జరుగుతుంది? ట్విటర్‌ యూజర్‌ తన యూజర్‌నేమ్‌ను (ఎట్‌ హ్యాండిల్‌) మార్చితే ‘బ్లూ టిక్‌’ దానంతట అదే తొలగిపోతుంది. ధ్రువీకృత స్థితి ఎఫెక్ట్‌ కాకుండా పేరు మార్చుకోవచ్చు గానీ ఖాతా హ్యాండిల్‌ను మార్చటానికి వీల్లేదు. ఉద్దేశపూర్వకంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు పేరు, బయోడేటా మారుస్తున్నారని భావించినా ట్విటర్‌ ‘బ్లూటిక్‌’ని తొలగించే అవకాశం ఉంది. ఒకవేళ ట్విటర్‌ అకౌంట్‌ ఆరు నెలలు యాక్టివ్‌గా లేకపోతే దాన్ని ఇన్‌యాక్టివ్‌గా చూపిస్తూ ‘బ్లూ టిక్‌’ తొలగిస్తారు. సర్వీసు నిబంధనలు ఉల్లంఘిస్తున్నా, ఖాతాదారుడి పాత హోదా మారినా, ఆ హోదాను వదిలినప్పట్నుంచి ధ్రువీకృత ప్రమాణాలకు సరిపోకపోయినా, ట్వీట్ల ద్వారా పదేపదే ఉల్లంఘనలు, దూషణలకు పాల్పడుతున్నా, విద్వేష పూరితంగా వ్యవహరిస్తున్నా, హింసను పొగుడుతున్నా, ఇతరత్రా కారణాలతో ‘బ్లూటిక్‌’ని ట్విటర్‌ తొలగిస్తుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న

రుచులు