ఒకేసారి 20 మందికి ట్వీట్‌ షేర్‌
close

Published : 01/09/2021 01:00 IST
ఒకేసారి 20 మందికి ట్వీట్‌ షేర్‌

డైరెక్ట్‌ మెసేజెస్‌ ఫీచర్‌లో ట్విటర్‌ కొత్త మార్పులు తీసుకొచ్చింది. వీటిల్లో ముఖ్యమైంది. ఒక మెసేజ్‌ను 20 మంది వరకు షేర్‌ చేసుకోవటానికి వీలు కల్పించటం. ఇప్పటివరకు గ్రూప్‌ క్రియేట్‌ చేయకుండా ఇద్దరి కన్నా ఎక్కువ మందికి ట్వీట్‌ను షేర్‌ చేసుకోవాలంటే విడివిడిగా పంపుకోవటం ఒక్కటే మార్గం. ఇది ఇబ్బందికరమైందే కాదు, సమయమూ ఎక్కువే తీసుకుంటుంది. వీటిని తొలగించటానికే ట్విటర్‌ కొత్త అప్‌డేట్‌ను ప్రవేశపెట్టింది. డైరెక్ట్‌ మెసేజెస్‌ ద్వారా ఒకేసారి  20 మందికి విడివిడిగా ట్వీట్‌ను షేర్‌ చేసుకోవటానికిది వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్‌ ముందుగా కంపెనీ ఐఓఎస్‌, వెబ్‌ ఆధారిత వేదికలకే వర్తిస్తుంది కానీ త్వరలో ఆండ్రాయిడ్‌ పరికరాలకూ అందుబాటులోకి రానుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న