ట్విటర్‌ వీడియో డౌన్‌లోడ్‌ ఇలా..
close

Updated : 29/09/2021 05:47 IST

ట్విటర్‌ వీడియో డౌన్‌లోడ్‌ ఇలా..

ట్విటర్‌ నుంచి నేరుగా వీడియోలను, జిఫ్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోలేం. థర్డ్‌పార్టీ యాప్‌లు లేదా వెబ్‌సైట్‌లే శరణ్యం. ఇందుకోసం పలు టూల్స్‌, ఎక్స్‌టెన్షన్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ ఇవి మంచి కన్నా హాని చేసే అవకాశమే ఎక్కువ. మరెలా? https://ssstwitter.com/en ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా, రెండు క్లిక్‌లతోనే ట్విటర్‌ వీడియోలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇది డెస్క్‌టాప్‌లో బాగా పనిచేస్తుంది.
* క్రోమ్‌ బ్రౌజర్‌లోనైతే చాలా తేలిక. ఉచితంగా అందుబాటులో ఉండే ఎస్‌ఎస్‌ఎస్‌ట్విటర్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఎక్స్‌టెన్షన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని, బ్రౌజర్‌కు యాడ్‌ చేసుకుంటే చాలు. ఆ తర్వాత ట్విటర్‌ పేజీని ఎప్పుడు ఓపెన్‌ చేసినా వీడియోలు, జిఫ్‌ల కిందే డౌన్‌లోడ్‌ బటన్‌ ప్రత్యక్షం అవుతుంది. దీన్ని క్లిక్‌ చేయగానే వివిధ క్వాలిటీల్లో డౌన్‌లోడ్‌ చేసుకునే ఆప్షన్లు కనిపిస్తాయి.
* ఒకవేళ ఎక్స్‌టెన్షన్‌ వద్దనుకుంటే ట్విటర్‌లో వీడియో ఉన్న పోస్టును క్లిక్‌ చేయాలి. అడ్రస్‌బార్‌లో 
https:// తర్వాత sss టైప్‌ చేసి ఎంటర్‌ నొక్కాలి. తర్వాత కావాల్సిన క్వాలిటీలో వీడియోను ఎంచుకొని.. డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
* ట్విటర్‌లో వీడియోతో కూడిన పోస్టును క్లిక్‌ చేసినప్పుడు అడ్రస్‌ బార్‌లో కనిపించే లింక్‌ను కాపీ చేసి,
ssstwitter.com లో పేస్ట్‌ చేసి కూడా వీడియోలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీల మీద రైట్‌ క్లిక్‌ చేసి కంప్యూటర్‌లో ఎక్కడ సేవ్‌ కావాలో ఎంచుకోవాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న