హింసని విరిచే సెరిటోనిన్‌
close

Updated : 10/03/2021 05:21 IST
హింసని విరిచే సెరిటోనిన్‌

సైన్స్‌ సంగతులు

రోజు రోజుకీ క్రైమ్‌ పెరుగుతోంది. ఇంతలా మానవజాతిని పట్టి పీడిస్తున్న హింస కారణంగా.. ఎన్నో నేరాలు. దాని మూలాన ఎంతో అశాంతి. అందుకేనేమో ఈ హింసకు సంబంధించిన అనేక పరిశోధనలు శాస్త్రవేత్తలు చేస్తున్నారు. హింసాప్రవృత్తి మనిషి మానసిక స్థితి కారణంగా ఉద్భవిస్తోందా? లేదంటే.. శరీరంలోని రసాయనాలు దీనికి కారణమా?.. లాంటి ప్రశ్నలకు సమాధానం వెతికే క్రమంలో అనేక పరిశోధనలు చేశారు. దీంతో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. కయ్యానికి కాలు దువ్వే మగవారిలో సాధారణ స్థాయికి మించి మగసెక్సు హార్మోన్‌ ‘టెస్టోస్టీరోన్‌’ ఉన్నట్లు గుర్తించారు. పైగా వారిలో ‘సెరటోనిన్‌’ అనే రసాయనం చాలా తక్కువ స్థాయిలో ఉండడం చూశారు. ఏంటీ సెరటోనిన్‌ అంటే.. ఇది కయ్యానికి కాలు దువ్వే లక్షణాన్ని అణచివేస్తోంది. మెదడు కణాలకు ‘పోట్లాడొద్దు. హింసవద్దు’ అనే సంకేతాల్ని పంపుతుంది. ఈ సెరటోనిన్‌ను ఉత్పత్తి చేసే పదార్థం వెన్నుముక ద్రవంలో ఉంటుంది. దాన్ని వెన్ను నుంచి తీయడం అంటే ఎంతో బాధని కలిగిస్తుంది. అందుకే ఆ పని చేయడానికి వీల్లేదని ఆంక్షలు విధించారు. దీంతో ఈ రంగంలో పరిశోధనలు వేగంగా కొనసాగడం లేదు. అయితే, శాస్త్రవేత్తలు గమనించిన కొన్ని విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. పసితనంలో కలబడే స్వభావం ఉన్నవారు పెద్దయిన తర్వాత కూడా అదే తీరుతో ఉంటారట. వారి సంతానంలోనూ ఎక్కువ మందికి అదే స్వభావం ఉండే అవకాశాలు హెచ్చుగా ఉంటాయంటున్నారు. పిల్లల్ని శిక్షించి వారిలోని హింసాప్రవృత్తిని తగ్గించొచ్చని అనుకునేవారికి శాస్త్రవేత్తలు చెబుతున్న మరో విషయం ఏంటంటే.. బిడ్డల్ని విచక్షణారహితంగా శిక్షించొద్దు. మంచి, చెడుల మధ్య తేడా తెలుసుకునేలా ఓపిగ్గా నేర్పడం ఎంతో మేలు. అప్పుడే వారిలో సున్నితమైన భావాల్ని మేలుకొలపడం సాధ్యం అవుతుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న